రుద్రాక్షలను ధరించేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

Divya
హిందూ ధర్మం ప్రకారం రుద్రాక్షకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఇందులో పరమశివుడు స్వయంగా ఉంటారని రుద్రాక్షను చాలా మంది ధరిస్తూ ఉంటారు. అలా రుద్రాక్షలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయని మన పూర్వీకులు కూడా తెలియజేస్తూ ఉంటారు. హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం రుద్రాక్ష పూజలను ధరించడం వల్ల మానసిక శారీరక ప్రయోజనాలు చాలానే కలుగుతాయిట. రుద్రాక్ష ధరించడం వల్ల సానుకూల ఆలోచనలు కూడా వస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే రుద్రాక్షలు ధరించడానికి కొన్ని నియమాలు ఉంటాయని చాలామందికి తెలియదు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మరి ధరించాల్సి ఉంటుంది.

రుద్రాక్షను మనికట్టు మెడ గుండెపైన ధరించవచ్చు. ముఖ్యంగా మెడల రుద్రాక్షను ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు స్నానం తర్వాత దీనిని ధరించడం శివుడి పూజ చేసేటప్పుడు అనుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయట. మణికట్టుకు అయితే రుద్రాక్షకు 12 రుద్రాక్షలను మాత్రమే ధరించాలి. మెడలో అయితే 36 రుద్రాక్ష మాలను ధరించాలి. శ్రావణమాసం రుద్రాక్ష ధరించడానికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక శివరాత్రి రోజు కూడా రుద్రాక్షను ధరించవచ్చు. సోమవారం రోజున ధరిస్తే చాలా మంచిదట. రుద్రాక్షలను ధరించే ముందు శివుని తాకి ధరించడం చాలా మంచిది.
రుద్రాక్ష ఎవరెవరు ధరించకూడదంటే స్రీలు కూడా రుద్రాక్షను ధరించవచ్చు. అయితే బిడ్డ పుట్టిన అది కూడా కొన్ని సందర్భాలలో మాత్రమే. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి లేదా బిడ్డకు రుద్రాక్షను వేయకూడదు అలాగే రుద్రాక్ష ధరించిన వ్యక్తి కొత్తగా జన్మించిన శిశువు దగ్గరకు ప్రవేశించకూడదు. ముఖ్యంగా మాంసాహారం తినే వారు కూడా రుద్రాక్షలను ధరించకూడదు. ధూమపానం మాంసాహారం వంటివి దూరంగా ఉండాలి ఒకవేళ వీటిని తినడం వల్ల రుద్రాక్ష అపవిత్రంగా మారుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు రుద్రాక్షను తీసివేయడం మంచిది. వీటిని దిండు కింద పెట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు చెడు కలలు కూడా  రావు. వీటిని ధరించి స్మశాన వాటికకు కూడా వెళ్లకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: