రథం ముగ్గు విశిష్టత ఏంటి ? కనుమ రోజే ఎందుకు వేయాలి..?

Divya
హిందూ ధర్మం ప్రకారం సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉందని మన పూర్వీకుల నుంచి వస్తున్న వార్తలు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ పర్వదినాన్ని భోగి ,సంక్రాంతి, కనుమగా జరుపుకుంటూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులపాటు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మూడవరోజు కనుమను పశువుల పండుగగా కూడా భావిస్తూ ఉంటారు. తమకు పాడి పంటలను సమృద్ధిగా అందించే పశువులకు కృతజ్ఞత తెలియజేస్తూ రైతు కుటుంబ సభ్యులు జరుపుకునే పండుగగా భావిస్తూ ఉంటారు. అందుచేతనే ఆ రోజున తమతో పాటు పశువులు , పక్షులకు కూడా ఆహారం అందించాలని చూస్తూ ఉంటారు రైతులు.
మరి కొంతమంది ధాన్యపు గింజలతో పాటు ధాన్యపు కంకులను కూడా ఇంటి ముందర కడుతూ ఉంటారు గ్రామాలలోని ప్రజలు. ఇక అంతే కాకుండా ధనుర్మాసం నెల రోజులపాటు వివిధ రంగ వల్లులతో తమ ఇంటి ముంగిట అలంకరించే మహిళలు ఈ కనుమ పండుగ రోజున మాత్రం రథం ముగ్గుని కచ్చితంగా వేస్తూ ఉంటారట. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే.. ప్రతి మనిషి శరీరం ఒక రధమని ఆ దేహమనే రథాన్ని నడిపే వాడే పరమాత్ముడుగా భావిస్తూ ఉంటారు.
తనను సరైన దారిలో నడిపించమని దేవుడిని ప్రార్థించటమే ఈ రధం ముగ్గులో దాగివున్న ఆంతర్యం అన్నట్లుగా మనం పురాణాలలో తెలియజేస్తున్నాయి. ఇక సంక్రాంతికి పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గును వేసి పువ్వులు కుంకుమలతో పూజించి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారని ఈ ముగ్గుకి అర్థమని మన పూర్వీకులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా రథం ముగ్గు ని తమ ఇంటి ముందర కనుమ రోజు వేసుకోవాలని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: