శ్రీవేంకటేశుని భక్తులకు ఇది లడ్డూలాంటి వార్త... ?

VAMSI
కరోనా కారణంగా భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తరచూ దేవాలయాలకు వెళ్లి ప్రశాంతతను పొందే భక్తులు ఈ లాక్ డౌన్ ల కారణంగా ఇంట్లోనే లాక్ అయిపోయారు. కల్యాణాలు, ఉత్సవాలు ఇలా అన్నీ వైరస్ వ్యాప్తి కారణంగా రద్దు చేయడంతో భక్తులు చాలా ఆందోళన చెందారు. ఎన్నడూ లేనిది తిరుమల తిరుపతి దేవాలయం ఆ శ్రీనివాసుని దేవాలయానికి సైతం తాళాలు పడ్డాయి. కాగా ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితులు అన్ని చక్కబడుతున్నాయి. దేవాలయాలు కూడా పున:ప్రారంభం అయ్యి మళ్ళీ యదావిధిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్సవాలు, వేడుకలు అన్ని మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో తీపి కబురు లభించింది. కరోనా కారణంగా సుమారు  రెండున్నర ఏళ్ల పాటు నిలిపివేసిన ఆర్జిత సేవలు తిరిగి జరగనున్నాయి. ఈ మేరకు భక్తులకు పిలుపును ఇస్తూ శుభవార్తను అందచేసింది టిటిడి. ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఆర్జిత సేవల టోకెన్లకు సంబంధించి ఆన్ లైన్ సేవలు మొదలయ్యాయి. కాగ ఆఫ్ లైన్ ద్వారా కూడా భక్తులకు అవకాశం కల్పించేందుకు లక్కీడిప్ పద్ధతిని ఏర్పాటు  చేయనున్నారు. నేటి నుండి ఈ లక్కీ డిప్ కార్యక్రమం ప్రారంభం కానుంది.  లక్కీ డిప్ కు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కిడిప్ కొరకు సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ టోకెన్ తీసుకున్న వారికి రెండు అక్నాలెడ్జ్‌మెంట్
స్లిప్ లు లభిస్తాయి.
అయితే అందులో ఒకటి యాత్రికుడికి ఇవ్వగా మరొకటి లక్కీ డిప్ కోసం వినియోగిస్తారు. లక్కీ డిప్ లో వచ్చిన స్లిప్ లను సేకరించి ఆయా భక్తులకు తెలియజేయనున్నారు. అంతే కాకుండా.. ఏప్రిల్ 2వ తేదీన తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాలలు కూడా ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ తిరుమల జనంతో కిటకిటలాడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: