భారతీయ సంస్కృతిలో అక్షింతలను చాలా గౌరవప్రథమైన సూచికగా భావిస్తారు. ఈ అక్షింతలను పండగలు, వివాహ శుభ కార్యాలు, పూజలు, పుట్టిన రోజులు వంటివాటిలో వాడతారు. పెద్ద వాళ్ళు ఎవరైనా చిన్న వారికి అక్షింతలు వేసి దీవిస్తూ ఉంటారు. అయితే అక్షింతలు బియ్యానికి పసుపు కలిపి వాటిని వేసి దీవిస్తారు. దీనితోపాటుగా పూజలు, వ్రతాలు ఇంకేమైనా దేవుడికి పూజలు చేస్తున్నప్పుడు విగ్రహాలపై అక్షింతలు వేసి మొక్కుతారు. అలాగే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు మనల్ని ఆశీర్వదించేటప్పుడు కూడా కచ్చితంగా అక్షింతలు వేసి దీవిస్తారు. మరి అక్షింతలు ఎందుకు వేయాలి.. వాటి వల్ల లాభం ఏమిటో మనం తెలుసుకుందాం..?
అక్షింతలు అంటేనే అవి క్షతం కానీ అని చెబుతుంటారు. అంటే రోకలి పోటుకు విరగవని అర్థం వస్తుంది. మంచి బియ్యం రోకలిపోటుకు విరిగిపోవు. అలాంటి బియ్యాన్ని పసుపు లేదా నెయ్యితో లేకుంటే నూనెతో కలిపి అక్షింతలుగా తయారు చేస్తారు. ఈ బియ్యం అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మనస్సులకు పెద్దవాడైన చంద్రుడి ప్రభావం మానవులపై అధికంగా ఉంటుందని చెబుతారు. మనిషి యొక్క మనసు, గుణము, బుద్ధి, వ్యసనము ఇవన్నీ చంద్రుడు పైన ఆధారపడి ఉంటాయట. అందుకే ఆ యొక్క చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, అందువల్ల మన ధర్మన్ని నియంత్రణ చేస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్లే అక్షింతలను తలపై వేసి మరీ ఆశీర్వాదం అందిస్తారు. మనిషి శరీరమే ఒక పెద్ద విద్యుత్ కేంద్రం. ఇందులో విద్యుత్ సరఫరా అనేది హెచ్చుతగ్గులు వస్తూ ఉండడం సర్వసాధారణం. అయితే ఈ వ్యత్యాసాలు మనిషి యొక్క మనసు మీద, వారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయని అయితే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు.
అందువల్ల తలపై అక్షింతలు వేసే సమయంలో దేహంలోని విద్యుత్తు కొంత అక్షింతలను తాగుతుంది. ఆశీర్వదించే వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకునే వారికి కొంత విద్యుత్ సరఫరా అవుతుంది. అందువల్ల తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ను గ్రహించి దేహానికి సరఫరా చేస్తుంది మన శిరస్సు. ఇలా పెద్దవాళ్లలో ఉండేటువంటి సాత్విక గుణం, బుద్ధులు చిన్న పిల్లలకు అక్షింతల ద్వారా లభిస్తాయని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే జీవనాధారానికి సంకేతం బియ్యమేనని చెబుతారు. మనం తినే అన్నం తయారయ్యేది ఆ బియ్యంతోనే కాబట్టి ఆ బియ్యాన్ని మన నెత్తి పై వేసి ఆశీర్వచనాలు అందిస్తారు.