క్రిస్మస్ పర్వదినాన యేసయ్య ప్రార్ధనలు...

VAMSI
డిసెంబర్ 25 వచ్చేసింది దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. నిన్న రాత్రి నుండే భక్తులు ప్రత్యేక ప్రార్ధనలు మొదలు పెట్టి గీతాలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగారు. ప్రపంచంలోని అన్ని చర్చ్ లు కూడా స్టార్స్ తో వెలుగులు విరజిమ్ముతూ అందంగా ముస్తాబయ్యాయి. ఈ క్రిస్టమస్ పండగ కళను సంతరించుకుని వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు ఏపిలో కానీ అటు తెలంగాణలో కానీ క్రిస్మస్ వేడుకలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టక పోవడంతో అర్థ రాత్రి నుంచి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులంతా కూడా చర్చ్ లకు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.
అటు తెలంగాణ రాష్ట్రం లోనూ మెదక్ సీఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిన్న రాత్రి నుండే ఘనంగా
మొదలయ్యాయి. తొలుతగా శిలువ ఊరేగింపు మొదటి ఆరాధన సమయంలో చర్చ్ బిషప్ సాల్మన్ రాజు పాల్గొని ముందుకు నడిపించారు. పలు  ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని ప్రార్దనలు జరిపారు. ఇలా అన్ని చోట్ల చర్చ్ లు వైభవంగా సిద్ధం అయ్యి భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలదరికీ దేవుడైన యేసుక్రీస్తు ప్రజల కోసం భూమికి దిగి వచ్చాడు. స్వయంగా ప్రజల కోసం తాను కష్టాలు పడి దేవుని యొక్క మహిమను తెలిసేలా చేశాడు.

ఈ లోకంలో ఉన్న పాపాత్ములు చేసిన పాపాలన్నిటినీ తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడిగి పాపవిముక్తులను చేశాడు. అంతటి నిజమైన దేవుని ఈ రోజు తన భక్తులు అన్ని విధాలుగా ఆరాధించి సంతోష పెడుతారు. అందరూ చాలా భక్తితో ఆ యేసయ్యను కొలుస్తారు. నిన్న ఈ రోజు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ యేసయ్య సమక్షంలోనే సేవ చేసుకుంటూ గడుపుతారు.  గత రెండు సంవత్సరాల నుండి ఎవ్వరూ సరిగా జరుపుకోలేదు. ఈసారైనా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: