మీకు శని దోషం పోవాలంటే.. అక్కడికి వెళ్ళండి..?

Divya
ఒకసారి మనకి నవగ్రహాల శని చుట్టుకుంది అంటే వాటి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కానీ వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రం కొన్ని పరిష్కారాలు ఉన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. చివరిసారిగా అందులో శక్తివంతమైన వాటిలో ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ని పూజించడం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ స్వామిని దర్శించడం వల్ల ఏలినాటి శని పోతుందని తెలియజేశారు. అయితే అవి ఏ ఏ దేవాలయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). జ్వాలా నరసింహస్వామి దేవాలయం:
ఇది తెలంగాణలో యాదగిరిగుట్ట గా పిలువబడుతుంది. ఇక్కడికి కుజదోషం ఉన్నవారు వెళ్లి నరసింహ స్వామి ని దర్శించు కోవచ్చు.
2). అహోబిలం:
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ గురు గ్రహ శని ఉన్న వారు ఇక్కడికి వెళ్లి నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల  వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
3). మాలోల నరసింహస్వామి:
ఇది కూడా అహోబిలంలోని ఒక కిలో మీటర్ దూరంలో ఉన్నది. దీనిని దర్శించుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయట.
4). వరాహ నరసింహస్వామి:
ఇది కూడా అహోబిలం  నుంచి కాస్త దూరంలో ఉన్నది.. రాహు గ్రహ శని నుంచి విముక్తి పొందవచ్చు.
5). కారంజ నరసింహస్వామి:
చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ స్వామిని దర్శించి నట్లయితే అవి తొలగిపోతాయి.
6). యోగ నరసింహస్వామి:
ఈ నరసింహస్వామిని కూడా శని గ్రహం ఉండే వారు దర్శించడం వల్ల దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు జీవిస్తారు.
7). పావన నరసింహ స్వామి:
బుధ గ్రహాల శని ఉన్నట్లు అయితే ఈ స్వామిని దర్శించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇది అహోబిలం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపుగా ఉన్నది.
8). భార్గవ నరసింహస్వామి:
సూర్య గ్రహ శని దోషాలు ఉంటే ఈ లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
9). చత్రవట నరసింహస్వామి:
కేతు గ్రహం శని దోషం ఉంటే..అలాంటివారు ఈ స్వామిని పూజించడం మంచిదట.
ఇవన్నీ కేవలం.. అహోబిలం లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.. వీటి గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: