జాతకంలో శని బలహీనంగా ఉంటే ఈ పొరపాట్లు వద్దు

Vimalatha
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు. శని దేవుడి కంటి చూపు చెడ్డదని చెబుతారు.శని దేవుడి చెడు కన్ను ఒకరి జీవితంపై పడితే, ఇక వారి జీవితంలో ఏడుపు మాత్రమే మిగులుతుందని నమ్ముతారు. అందుకే శనిదేవుని దృష్టిలో పడకుండా ఉండేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దీనికి జ్యోతిష్యంలో కూడా అనేక పరిహారాలు చెబుతారు. మరోవైపు జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, చేస్తున్న పని కూడా నాశనం కావడం ప్రారంభమవుతుంది. ఎంత చేసినా వ్యక్తి తన కష్టానికి పూర్తి ఫలాలను పొందలేడు. ఒకరి తర్వాత ఒకరు చెడు అలవాట్లకు బలైపోవడం మొదలవుతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే పాడైపోవడంతోపాటు ఆర్థిక నష్టంతో పాటు పరువు, గౌరవం కూడా కోల్పోతారు. మొత్తానికి శని గ్రహ దర్శనంలాగే శని బలహీన స్థానమూ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. శని దేవుడు కర్మలను ఇచ్చేవాడు కాబట్టి, మనం చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కర్మ క్షీణిస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది.
శని బలహీనంగా ఉన్నప్పుడు పొరపాటున కూడా ఈ పని చేయకండి
జాతకంలో శని బలహీనంగా ఉంటే నిస్సహాయులను, వృద్ధులను, స్త్రీలను అవమానించవద్దు, పేదవారిని హేళన చేయవద్దు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది.
మీరు పుష్కలంగా మాంసం, మద్యం, మాదకద్రవ్యాలు మొదలైన వాటిని కొంచం తగ్గించాలి. లేకపోతే ఈ వ్యసనం పెరుగుతూనే ఉంటుంది. మీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారడం ప్రారంభమవుతుంది.
ఎవరిపైనా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అంతే కాకుండా జూదం, వివాహేతర సంబంధాలు, దొంగతనం, నేరాలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. వీటిల్లో చిక్కుకుంటే తేలిగ్గా బయటపడలేక జీవితం నాశనం అవుతుంది.
శని బలహీనంగా ఉన్నందున శనివారం రోజు గోర్లు, వెంట్రుకలను కత్తిరించవద్దు. జంతువులు, పక్షులు మరియు బలహీనమైన వ్యక్తులకు భంగం కలిగించవద్దు. శని అలాంటి ప్రజలను క్షమించడు. అలా చేసినందుకు వారు కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: