భక్తులకు భారం కానున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలు..!!

Divya
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ లో గుట్టపై ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో ఇకపై స్వామివారి సేవలు భక్తులకు భారంగా మారనున్నాయి. ఈరోజు అనగా శుక్రవారం నుంచి స్వామివారి సేవలు ప్రసాదాల ధరలు కూడా పెరిగనున్నాయి అని ఈవో గీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఈ పుణ్య క్షేత్రంలో భక్తులు నిర్వహించే నిత్యపూజలపై కూడా ధరలు పెంచడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఈ విషయంపై గీత మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కి సంబంధించిన పూజల పై కానీ,  ప్రసాదాల పై కానీ ఎటువంటి ధరలు పెంచలేదు.. కానీ ఇప్పుడు కొవిడ్ కారణంగా ఆలయ ఆదాయం కుంటుపడిందని,  అందుకే అక్కడ పనిచేసే వారి యొక్క జీతభత్యాల పై ఆర్థికభారం పెరిగిందని అందరినీ దృష్టిలో పెట్టుకుని స్వామి వారి సేవల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కేవలం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాత్రమే కాకుండా యాదాద్రి అనుబంధ ఆలయాల్లో కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని ఆమె తెలపడం గమనార్హం..
పెరిగిన ధరల విషయానికి వస్తే.. వీవీఐపీలు లక్ష్మీ నరసింహ స్వామికి ఒకవేళ సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరిపించుకునేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్ ధరను సుమారుగా రూ.1,500 కు నిర్ణయించారు. ఈ టికెట్ ధర కొత్తగా నిర్ణయించబడింది. ఇందుకు కారణం ఏమిటంటే దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వామివారి నిత్య కళ్యాణం టికెట్ ధర 250 రూపాయలు పెంచుతూ రూ.1,250 కాస్తా రూ.1,500 కు చేశారు. నిజాభిషేకం కు రూ.500 నుంచి రూ.800 కు పెంచారు.
సత్యనారాయణ వ్రతం సామాగ్రి తో కలిపి రూ. 500 నుంచి రూ.800 పెంచగా, స్వామివారికి జరిపే అష్టోత్తరం టికెట్ ధర వంద రూపాయల నుంచి రూ.200 పెంచడం జరిగింది. సుదర్శన్ హోమం టికెట్ ధర రూ.1116 నుంచి రూ.1250 కి పెంచారు. వేదాశీర్వచనం రూ. 516 నుంచి రూ. 600 కు పెంచారు . సువర్ణ పుష్పార్చన రూ. 516 నుంచి రూ. 600 కు పెంచారు. ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ రూ. 750 నుంచి రూ. 1,000, 100 గ్రాముల లడ్డూ ధర రూ. 20నుంచి రూ. 30 కాగా 500 గ్రాముల లడ్డూ ధర ఇప్పుడు రూ. 100 నుంచి రూ. 150 పెంచాగా అదే 250 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ ధర రూ. 15 నుంచి రూ. 20 పెంచారు. ఇక 250 గ్రాముల వడ రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. . ఆలయ నిర్వహణ భారం దృష్ట్యా భక్తులు ఆలయ ఆదాయ పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని ఈవో గీత కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: