కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి

Vimalatha
కార్తీక పౌర్ణమి మన భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండగ. భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ కార్తీక పౌర్ణమి దీపావళి తర్వాత 15 రోజులకు వస్తుంది. హిందూమతంలో కార్తీక పూర్ణిమకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుచుకుంటారు. ఈసారి కార్తీక పూర్ణిమ నవంబర్ 19 శుక్రవారం వస్తుండగా, ఈ కార్తీక పూర్ణిమ గత అన్ని పౌర్ణమిలలో కెల్లా అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది. ఇళ్లలో దీపాలు వెలిగించి పూజలు, పౌర్ణమి ఆరాధన చేయడం వల్ల ఆ ఇంట్లో సంతోషం కలుగుతుందని చెబుతారు.ఈ రోజున భోలేనాథ్ అనే రాక్షసుడిని త్రిపురాసురుడిని అంతం చేసాడు. ఈ సంతోషంలో దేవతలు దీపం వెలిగించి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ రోజు పూజలు, దానం మొదలైన వాటి ద్వారా విశేష పుణ్యం లభిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం కార్తీక పూర్ణిమ రోజున విష్ణువు చేప ఆకారంలోకి మారాడు. ఈ రోజు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. విష్ణువు, లక్ష్మిని పూజిస్తారు.
కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఈ తప్పులు అస్సలు చేయొద్దు
కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు ఎవరితోనూ వాదించకండి. దురుసుగా ప్రవర్తించడం, దూషించే మాటలు మాట్లాడడం వంటి తప్పులు చేయవద్దు.
ఈ రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ఒక నిస్సహాయుడిని లేదా పేదవాడిని అవమానించడం వల్ల మీరు చేసే దానాలు, పుణ్యాలు పుణ్యాల ఫలం వేస్ట్ అయిపోతుంది.
ఈ పవిత్రమైన రోజు గోర్లు, జుట్టు కత్తిరించడం చేయొద్దు. అలా చేస్తే అది జీవితంలో ఇబ్బందులను ఆహ్వానిస్తుంది.
ఇది శుభ సమయం
నవంబర్ 18, గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి పూర్ణిమ తేదీ ప్రారంభమవుతుంది:
నవంబర్ 19, శుక్రవారం మధ్యాహ్నం 02:26 వరకు పూర్ణిమ తేదీ ముగుస్తుంది
ప్రదోష కాల ముహూర్తం :  18 నవంబర్ సాయంత్రం 05:09 నుండి 07:47 నిమిషాల వరకు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: