ఈ నెలలో.. కచ్చితంగా ఈ దేవుడిని దర్శించాలట..!

Divya
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దేవాలయాల్లో ఎన్నో అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనకు తెలుసు. మిగతావన్నీ అలాగే మిస్టరీగానే ఉన్నాయి. అలాంటి వాటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆలయాలలో మహానంది పుణ్యక్షేత్రం కూడా ఒకటి. ఇది కర్నూలు జిల్లా దగ్గర నంద్యాల లో ఉన్నది. ఇప్పుడు ఈ ఆలయం గురించి మనం చూద్దాం.
ఈ మహానందిలో  కొన్ని సంవత్సరాలుగా నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ ప్రవహించేటువంటి నీటిని భక్తులు తీర్ధంగా భావిస్తారు. ఇక ఈ ఆలయం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ మహానందిలో ఉన్న శివలింగానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత కూడా వుంది. ఇక్కడ శివలింగం పుట్టలో నుంచి ఆవిర్భవించింది. అక్కడ వెలిసినటువంటి శివలింగానికి.. ఒక ఆవు పాలు ఇస్తుండగా.. ఆ ఆవు యజమాని దానిని కొట్టడంతో.. ఆవు అదుపుతప్పి శివలింగాన్ని తొక్కింది. దాంతో ఆ శివలింగం పై ఈ ఆవు యొక్క కాళ్ల ముద్రలు కూడా ఉండడం మనం గమనించవచ్చు.
దాంతో ఇతర శివలింగాల కన్నా ఇక్కడ కొద్దిగా తక్కువ ఎత్తులో ఈ శివలింగం ఉంటుంది. ఈ మహానంది శివలింగానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉన్నది. అదేమిటంటే ఈ లింగం క్రింద నుండి నీరు ఉబుకుతూ వస్తూ ఉంటుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి అని కొంత మంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లుగా కూడా సమాచారం.
ఈ నీరు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ నీరు వల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక అంతే కాకుండా అక్కడే కామేశ్వరి దేవి ఆలయం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నవి. అక్కడినుంచి 20 మైళ్ళ దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా ఉన్నాయి.ఈ నందులనే అందరూ నవనందులు అంటారు. అందుకోసమే ఈ కార్తీకమాసంలో సోమవారం రోజున నందీశ్వర పూజ చేయించుకోవడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: