కార్తీక మాసంలో..ఏ పనులు చేయాలో..చేయకూడదో తెలుసా..?

Divya
హిందూ పురాణాల ప్రకారం ఈ నెల ఎంతో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ నెలలో శ్రీ మహావిష్ణువు కొన్ని నెలల పాటు నిద్రించి ఈ నెలలో నిద్రలేస్తాడని మన హిందువుల నమ్మకం. అంతే కాకుండా ఇదే నెలలోనే తారకాసురుడిని కార్తికేయుడు చంపడం జరిగిందని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. అందుచేతనే ఈ నెలలో ఎక్కువగా పూజలు, ఉపవాసాలతో ఉండి ఒక పండుగలా జరుపుకుంటారు. అయితే ఈ నెలలో ఏ పనులు చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఈ మాసంలో ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో ఎలాంటి పని చేసిన రెట్టింపుగా లాభం వస్తుందట. అంతేకాకుండా కొన్ని పనులు చేయడంవల్ల చాలా ఇబ్బందులు కూడా పడవలసి వస్తుందట.
ఈ నెలలో ఏదైనా నీటి ప్రవాహంచే (నదిలో, కాలువలో)వాటిలో స్నానం చేయడం చాలా మంచిదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా బ్రహ్మ ముహూర్తం లో చేయడంవల్ల ఈ భూమిపై ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు చూసినంత పుణ్య లభిస్తుందట. ఒకవేళ మీ దగ్గరలో ఇలాంటివి లేకపోతే.. మీరు గంగాజలాన్ని తెచ్చుకొని ఇంట్లో బకెట్లో వేసుకుని స్నానం చేసుకోవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా తులసి చెట్టును పూజించడం చాలా పవిత్రమైనదట. తులసి చెట్టు ను బాగా అలంకరించి, ఆ చెట్టుకు చీర కట్టడం, పసుపు వంటివి పట్టించడం వల్ల చాలా శుభం జరుగుతుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.
దీపారాధన చేసేటప్పుడు కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడాలంట. ఉపవాసం ఉండేవారు రోజుకి ఒక గ్లాసు పాలు, అందులోకి చక్కెరకు బదులుగా కొద్దిగా బెల్లాన్ని కలుపుకోవాలి.
కార్తీక మాసం తో పాటు ఈనెల చలికాలం ప్రారంభం అవుతుంది కనుక, ఫ్రిజ్ లో నీటిని తాగ కూడదు, మద్యం మాంసం వంటివి ముట్టకూడదు.
ఈ నెలలో నేల పైనే ఎక్కువగా నిద్రించడం మంచిదట. ముఖ్యంగా ఎవరైతే సహనంతో ఉంటారో వారికి శుభం కలుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: