మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. ఇలా చేస్తే సరి..!
మనం ఎక్కువగా ఇండ్ల లో ఐశ్వర్య దీపాన్ని పెడుతూ ఉంటాం. అయితే ఐశ్వర్య దీపం అనగా ఇది ఉప్పుతో చేయబడుతుంది. మనం ఎక్కువగా ఏదైనా ఇల్లు మారినప్పుడు, ఆఫీసులలో ఏదైనా అనారోగ్యం వాతావరణంలో అనిపించినప్పుడు ఐశ్వర్య కాళీ మాత లేదా ఐశ్వర్య దీపాన్ని, పాదాలను అక్కడ పెడితే మంచిదట. అంతేకాకుండా ఈశాన్య దిక్కులో రాగి చెంబులో నీళ్ళను ఉంచి, అందులోకి ఏవైనా ఎర్రని పూలను వేసి, అందులోకి కొంచెం కుంకుమ పసుపు వేసి, ఈశాన్య దిక్కున ఉంచడం వల్ల మంచి ఫలితం లభిస్తుందట.
నెలలో ఒకసారి అయినా ఆఫీసులు, షాపులకు బూడిద గుమ్మడికాయకు ఎరుపు రంగు గుడ్డను చుట్టి వేలాడదీయడం మంచిదంటున్నారు కొంతమంది పండితులు. మనం కష్టపడిన సంపాదనంతా ఇంట్లో నిలవకుండా వుంటే వ్యాపారం చేసే వారు, తక్కువ జీతం వచ్చేవారు పరిస్థితి చాలా దీన స్థితిలో ఉండవలసి ఉంటుంది. అందుకు గల కారణం దిష్టి వల్ల ఇలా జరిగి ఉంటుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఇలాంటి వారికి ఐశ్వర్య దీపం బాగా ఉపయోగపడుతుందట.
ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం ఉదయం పూట, లేదా సాయంత్రం వేళ అయినా పెట్టాలి. ముఖ్యంగా ఈ దీపానికి పసుపు కుంకుమ రాసి, బియ్యం పైన ఉంచాలి. ఇక వాటి చుట్టూ కొద్దిగా ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు పైన కూడా కుంకుమ పసుపు చల్లాలి, ఇక అంతే కాకుండా వాటి చుట్టూ పూలు, నెయ్యి పోసి అ ద్వీపాన్ని వెలిగించాలట. ముఖ్యంగా అందులో రెండు ఒత్తులను ఉంచాలట. అంతే కాకుండా వాటి దగ్గర బెల్లం, కొబ్బరికాయ మంచిది నైవేద్యంగా పెట్టాలట. ఇలా చేసిన తర్వాత మరుసటి రోజున వాటన్నిటిని ఏదైనా గంగలోకి కలిపేయాలి.