"కన్నబిడ్డనే చంపిన తల్లి"... అదే దీపావళి?
అయితే రోజురోజుకు నరకాసురుడి బాధలు, వేదింపులు ఎక్కువ అవడంతో భరించలేని దేవతలు, గంధర్వులు, మునులు, తమ బాదని ఆ శ్రీహరికి చెప్పుకుని తమని రక్షించమని ప్రాదేయపడతారు. వారి గోడును విన్న శ్రీహరి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి ఆ తర్వాతా సత్యభామగా అవతరించిన భూదేవిని వివాహం ఆడి నరకాసురుడిని సంహరింపజేయిస్తాడు. అలా నరకాసురుని చావు ఆయన తల్లి చేతుల్లోనే జరుగుతుంది. దాంతో ముల్లోకాలకు నరకాసుర నుండి విముక్తి లభిస్తుంది. అంటే అందరి జీవితంలో అలుముకున్న చీకటి కోణాలు వీడి కొత్త వెలుగులు ప్రసరించిన రోజు అన్నమాట. అందుకే ప్రతి ఏడు ఆ రోజున అందరూ దీపావళి వెలిగించి తమ జీవితంలోకి వచ్చిన వెలుగులను ఆహానిస్తు జరుపుకోవడం మొదలయ్యింది అని ఒక పురాణ కథనం.
అయితే ఇంతటి చరిత్ర ఉన్న దీపావళి రోజున కొన్ని పనులు తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళి రోజున ఇంటిలో దీపాలు వెలిగించాలి. అయితే చాలా మంది పండుగ రోజు కావడంతో ఊర్లకు ప్రయాణం అవుతుంటారు. అలాంటి వారు వీలైనంత వరకు ఉదయం పూజ చేసుకుని దీపం వెలిగించి వెళ్ళాలి. లేదా కనీసం ఇంట్లో లైట్లు వంటివి వేచి వెళ్ళాలి. ఇంటిని మాత్రం అస్సలు చీకట్లో ఉంచి వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే ఈ రోజున మహాలక్ష్మిని పూజించండి సర్వ శ్రేష్టం. లక్ష్మి దేవిని తప్పక పూజించాలి అని అంటున్నారు.