మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా.. లేదా..?

Divya
స్త్రీలకు భక్తి బావం ఎక్కువగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో వీరికి ఉన్నటువంటి శ్రద్ధ ఎవరికీ ఉండదు. ఎక్కడినుంచో పూలు పోసుకుని వచ్చి.. స్వామికి సమర్పిస్తూ, సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా అభిషేకాలు, పూజలు అంటూ చుట్టుపక్కల దేవాలయాలన్నీటికి వెళుతూ ఉంటారు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఇక దేవుని సన్నిధిలోని వీరు కాలాన్ని గడుపుతూ ఉంటారు.అయితే ఇప్పుడు గర్భవతులైన స్త్రీలు పూజలు, వ్రతాలు అనేది చేయవచ్చా లేదా అనే విషయం ప్రతి ఒక్కరికి సందేహంగానే ఉండవచ్చు. అయితే ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

నిజానికి గర్భవతిగా ఉన్న మహిళ మూడు నెలలు దాటితే.. ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయకుండా, కొత్త నిర్మాణాలు వంటివి చేపట్టకూడదు. ఒకవేళ ఏదైనా ఇల్లు నిర్మించి మధ్యలో ఆగిపోయిన.. వాటిని మొదలుపెడితే గర్భంలో ఉండే శిశువుకు పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని కొంతమంది పండితులు సూచిస్తున్నారు.

గర్భవతులైన స్త్రీలు పూజలు చేయవచ్చా లేదా అనే విషయంపై కొంతమంది అనేక సలహాలు ఇవ్వడం జరుగుతోంది. కాని శాస్త్రం ప్రకారం గర్భిణి అయిన స్త్రీ తేలికపాటి పూజను నిర్వహించుకోవచ్చు. కానీ కానీ టెంకాయ వంటివి మాత్రం కొట్టకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గుడి చుట్టూ ప్రదర్శనలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, కొత్త పూజలు వంటివి ప్రారంభించకూడదని తెలియజేస్తున్నారు. ఒకవేళ వీరు దేవుడి ముందర ధ్యానం వంటివి చేయవచ్చు అని కొంతమంది చెబుతున్నారు.

గర్భవతులలో ఇలాంటి  నియమం విధించడం వల్ల వారికి రాబోయే పలు ఇబ్బందుల నుంచి రక్షిస్తుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు 5 మాసం వచ్చే వరకు వ్రతం చేయవచ్చని, ఆ తరువాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజ గది దగ్గరకు కూడా రాకూడదని శాస్త్రం తెలియజేస్తోంది. ఏదైనా  కొండ మీద ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళకూడదట. అలా వెళ్లడం వల్ల మీరు ఏదైనా ప్రమాదంలో పడవచ్చని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: