నవరాత్రుల వెనుక వున్న ఆంతర్యం ఇదేనా..?

frame నవరాత్రుల వెనుక వున్న ఆంతర్యం ఇదేనా..?

Divya
మరికొద్ది రోజుల్లో దసరా దేవీ నవరాత్రులు మొదలవుతున్న విషయం తెలిసిందే.. అయితే నవరాత్రులు అనగా తొమ్మిది రోజులపాటు దుర్గా దేవి 9 అవతారాలలో మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ నవరాత్రుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
దసరా అనేది హిందువులలో అతి పెద్ద పండుగగా గుర్తింపు పొందింది. దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కాబట్టి ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు.. ఈ పండుగ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే.. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు జనాలను బాగా పీడించేవాడు.. దేవతలను కూడా  అతి క్రూరంగా హింసించేవాడు.. ఇక మహిషం అంటే దున్నపోతు.. ఈ రాక్షసుడి తల దున్నపోతు తలగా ఉండేది.. అసురుడు అంటే రాక్షసుడు కాబట్టి మహిషాసురుడు అనే పేరు ఉంది.
ఇతడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టిస్తారు. దుర్గాదేవి అందానికి మోహితుడైన మహిషాసురుడు ఎలాగైనా సరే దుర్గా దేవిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే అప్పుడు దుర్గా దేవి మహిషాసురుడికి కొన్ని ఆంక్షలు విధిస్తుంది. తనతో యుద్ధంచేసి తనను గెలిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెబుతుంది దుర్గాదేవి..ఇలా వీరిద్దరి మధ్య తొమ్మిది రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది.. ఇక ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి ఒక్కో రోజు, ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడితో యుద్ధానికి దిగుతుంది.. ఇక పదవ రోజున మహిషాసురుడిని సంహరిస్తుంది. ఇక ఆరోజు నుంచి హిందువులు ఆ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావించి ,దసరా అనే పండుగ ద్వారా ఉత్సవాలు జరుపుకుంటారు.
దుర్గాదేవి మహిషాసురుడి దున్నపోతు తలను సంహరిస్తుంది కాబట్టి ఈ దసరా రోజున చాలామంది దున్నపోతులను అమ్మవారికి బలి ఇస్తూ ఉంటారు. దుర్గాదేవి మొదట మూడు రోజులు దుర్గా దేవి రూపాల్లో, మరో మూడు రోజులు లక్ష్మీదేవిగా, మరో మూడు రోజులు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ కారణంగా రాముడు కూడా రావణుడిని సులభంగా సంహరించాడు అని సమాచారం.. దుర్గాదేవి మహా శివుడిని ప్రార్థించి, ఈ తొమ్మిది రోజుల పాటు తన తల్లి భూమాత దగ్గర ఉంటానని కోరిందట. ఆమె కోరికను మన్నించి తొమ్మిది రోజుల పాటు తన తల్లి దగ్గర ఉండమని చెప్పాడు.
తొమ్మిది రోజులు భూమిపై మనకు అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారని పురోహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: