పూజ చేసేటప్పుడు ఈ విషయాలను అస్సలు మరవొద్దు

Vimalatha
పూజ అనేది హిందూ దేశమైన భారతదేశంలో చాలా ముఖ్యమైన ప్రకియ. హిందూ వాదులందరూ పూజను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి ఒక్కరూ తనదైన రీతిలో, శైలిలో దేవుడిని పూజిస్తారు. కొంతమంది మాత్రం దేవునికి ధూపం వేసి, నమస్కరించి ఆరాధనను పూర్తి చేస్తారు. కానీ పూజ చేసేటప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకోవాలి.
హిందూ మతం లో దేవుడిని ఆరాధించేటప్పుడు మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దేవుని ఆరాధన, పూజను ఎప్పుడూ ఒక నిర్దిష్ట సమయంలో, ఒకే ప్రదేశం లో కూర్చొని స్వచ్ఛమైన మనస్సు తో చేయాలి.  పూజ చేసేటప్పుడు మన తలలు కప్పుకోవాలనే నియమం ఒకటి ఉంది. పూజ చేసేటప్పుడు అందరూ తమ తలలను కప్పుకోవడం దేవుడికి గౌరవంగా భావిస్తారు. అంతేకాదు అలా చేస్తే ప్రతికూల ప్రభావం బారిన పడకుండా ఉంటారు. సనాతన సంప్రదాయం లో పూజ సమయంలో నలుపు రంగు వాడకూడదు.
దేవుడిని ఎప్పుడూ ఒక చేత్తో పూజించకూడదు. ఒకవేళ మీరు దేవుడి విగ్రహాన్ని తాకే అవకాశాన్ని పొందితే మీరు అతని ఎడమ పాదాన్ని మీ ఎడమ చేతితో, అతని కుడి పాదాన్ని మీ కుడి చేతితో తాకి ఆశీర్వాదాలు తీసుకోవాలి. దేవుని విగ్రహం ముందు నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారం కూడా చేయవచ్చు. గ్రంథాల ప్రకారం పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి.
విష్ణుమూర్తికి ప్రియమైన తులసి ని పూజలో ప్రసాదంగా పెట్టండి. విష్ణువు ఆశీర్వాదం పొందాలనుకుంటే ముఖ్యంగా గురువారం తులసి చెట్టు కింద స్వచ్ఛమైన నెయ్యి తో వెలిగించండి. అపరిశుభ్రమైన చేతులతో తులసి మొక్కను ఎప్పుడూ తాకవద్దు. రాత్రి, మంగళ, ఆదివారాల్లో తులసి ఆకులను తెంపవద్దు.
దేవుడి పూజ కోసం వెలిగించే దీపాన్ని ఇతర దీపాలతో వెలిగించవద్దు. కొత్త అగ్గిపుల్ల ఉపయోగించండి. శని దేవుని ఆరాధనలో ఆవనూనె దీపం మాత్రమే వెలిగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: