దేవకన్యలు దర్శించుకునే క్షేత్రం ఎక్కడో తెలుసా ..?

Divya
దేవకన్యలు.. స్వర్గలోకంలో ఉన్న.. దేవుడి పెళ్లి కాని కుమార్తెలను దేవకన్యలు అని అంటారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే దేవకన్యలు భూలోకానికి వచ్చి దర్శించుకునేంత ప్రత్యేకమైన దేవాలయం ఎక్కడ ఉంది..? ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చటి చెట్ల మధ్య.. ప్రశాంతమైన వాతావరణంలో.. మనసుకు హాయి కలిగించేలా ఉన్న పరిసరాలలో ఈ క్షేత్రంలో.. అమ్మ త్రిపురసుందరీదేవిని ప్రతిరోజు స్వర్గం నుంచి దిగి వచ్చి దేవకన్యలు దర్శించుకుంటారని అంటారు.. 5,000 సంవత్సరాల కిందట ఈ ఆలయంలో త్రిపురసుందరీ దేవి స్వయంభువుగా వెలసింది అని, ఇక అమ్మవారిని దర్శించుకోవడం కోసం వీరు వస్తారని చరిత్ర చెబుతోంది.. ముఖ్యంగా కన్యలకు మాత్రమే ఈ దేవాలయం అత్యంత పవిత్రతను సంతరించుకుంది. అయితే కన్యతీర్థం గా గొప్ప ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర దండ్లూరి గ్రామ పొలిమేరలో పినాకిని నది ఒడ్డున , భాను కొండల మధ్య అత్యంత సుందరంగా అమ్మవారి క్షేత్రం మనకు కనిపిస్తుంది.. అన్ని దేవాలయాల్లో అమ్మవారికి పీఠం ఉన్నట్లు గా, ఈ అమ్మవారికి ఎక్కడ కూడా పీఠం కనిపించదు. అంతే కాదు అమ్మవారి విగ్రహం శిల భూమి లోపల ఎంతవరకు ఉందో కూడా తెలియదు.. ఇక దేవకన్యలు ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానమాచరించి, త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటారు. అందుకే ఈ గుడికి కన్యతీర్థం అని పేరు కూడా వచ్చింది అని స్థలపురాణం చెబుతోంది.

ఇక అప్పట్లో ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అగస్త్యముని, జగద్గురు ఆదిశంకరాచార్యులు, వీరి తర్వాత ఆచార్య నాగార్జునుడు ,శాతవాహనులు, చంద్రగుప్త మౌర్యుడు ,చోళులు, శ్రీకృష్ణదేవరాయలు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి ఎంతో మంది అత్యంత పుణ్య పురుషులు ఈ దేవాలయాన్ని సందర్శించినట్లు పురాణం చెబుతోంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన రాజులే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారట.. ముఖ్యంగా పండుగ వేళల్లో దేవతల రాజు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారట. మహా శివుడు కూడా స్వయంభూగా వెలశాడు.
ఇక్కడ వారాహి, వైష్ణవి, బ్రాహ్మణి ,మహేశ్వరి ,కౌమారి, చాముండి, ఇంద్రాణి వంటి 7 మంది దేవతలు ఒకేచోట కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తమాతృకా క్షేత్రమని, దేవేంద్రుడు రావడం వల్ల దేవ క్షేత్రమని, అగస్త్యమహర్షి తపస్సు చేయడంవల్ల ఈ క్షేత్రాన్ని అగస్త్య క్షేత్రమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.
ఈ ఆలయంలో త్రిపుర సుందరి దేవి తో పాటు సుందరేశ్వరుడు , వినాయకుడు, లక్ష్మీ సత్యనారాయణ స్వామి, కార్తికేయుడు వంటి దేవతలను మనం ఈ క్షేత్రంలో దర్శించుకోవచ్చు.. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కోరిన కోర్కెను కచ్చితంగా ఇక్కడి అమ్మవారు నెరవేరుస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: