రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

VAMSI
మనిషి జీవితంలో ప్రేమ అనే అంశాన్ని ప్రస్తావించకుండా అస్సలు ముందుకు సాగదు. అలాంటి ప్రేమ అనే పదం అనగానే గుర్తొచ్చేది రాధాకృష్ణులు. వీరిని ఆత్మ పరమాత్మ మధ్య జరిగేటటువంటి ప్రేమకు చిహ్నంగా వీరి బంధాన్ని భావించి పూజిస్తుంటాము. కృష్ణుడు పెరిగినటువంటి బృందావనానికి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బర్శాను అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వృషబాను , అమలావతి అనే దంపతుల కుమార్తె రాధ దేవి. ఇక రాధాకృష్ణులు ఒకరినొకరు ఇష్టపడుతూ కలిసి తిరిగారు. వారి మధ్య ప్రేమ బంధం పెరుగుతూనే వచ్చింది. బృందావనంలో గోపిక లందరూ కృష్ణుని వెంటపడుతుంటే.... కృష్ణ  ప్రేమ మాత్రం రాధకే సొంతం అయ్యింది. రాధ పవిత్రమైన భక్తితో నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఆరాధించేది. కిట్టయ్యకు యుక్త వయసు వచ్చాక తన కర్తవ్యాలను నిర్వర్తించుట కొరకు ఆయన రాధను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగానే రాధ దేవిని వదిలి వెళ్ళారు కృష్ణయ్య. 

అయితే బృందావనంలో ఉన్నటువంటి రాధ మాత్రం ప్రతి క్షణం కిట్టయ్య కోసమే కలలు కంటూ  ఆయన రాక కొరకు  ఎదురు చూసింది. కృష్ణుడు తన ప్రత్యర్థులు అందరినీ మట్టుపెట్టి ప్రపంచవ్యాప్తంగా దేవునిగా కీర్తింప పడి  పూజలందుకుంటున్నారు.  రుక్మిణి, సత్యలను వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆరంభించారు. పాండవుల కొరకు మహాభారత యుద్ధమునకు సారధ్యం కూడా వహించారు. ఇలా   తన కర్తవ్యంలో నిమగ్నులై ఉన్నారు. కానీ అక్కడ రాధమ్మ మాత్రం కన్నయ్య కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆ తర్వాత పలు మార్లు కృష్ణుడు రాధను కలవడానికి వచ్చినపుడు మీరు నన్ను ఎందుకు వివాహం చేసుకోవట్లేదు అని కృష్ణుడిని ప్రశ్నించారట రాధ. అయితే అందుకు కృష్ణుడు ఏమన్నారంటే..దేవి నీవు నాతో చాలా సార్లు చెప్పిన మాటను నీకు నేను చెప్పాలనుకుంటున్నాను.

ఆ తర్వాత నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అన్నారట. నీవు పలుమార్లు వివాహం అంటే రెండు అత్మల కలయిక అని నీవు అన్నావు. కానీ నీవే నా ఆత్మ అలాంటిది నీవే నా ఆత్మ అయినపుడు నన్ను నేను ఎలా వివాహం చేసుకోగలను అని అన్నారట. అప్పుడు ఆమెకు అందులోని ఆంతర్యం అర్దం అయిందట. అంతేకాదు నీపేరు ఎప్పుడూ నా పేరు ముందే ఉంటుందని గొప్ప వరం ఇచ్చారట. అందుకే ఇక అప్పటి నుండి రాధ కృష్ణులని అంటారు కానీ...కృష్ణా రాధలు అని సంబోధించరు. కృష్ణుని దేవాలయాలు కూడా రాధాకృష్ణ దేవాలయాలుగా ప్రసిద్ది చెందాయి. రాధాకృష్ణుల ప్రేమ పవిత్రమైనది. వారి ప్రేమ సత్యం, నిత్యం, అమరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: