ఈ మహాశివుడి ఆలయం చాలా ప్రత్యేకం ?
ఈశ్వర్ ఆలయంలోని శివలింగం ప్రాచీనమైంది అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం చాలా ఏళ్ల క్రితమే నిర్మించారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్క అంగుళమే బయటపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే తరహాలో సముద్రంలోకి మునిగిపోతుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం, మళ్లీ విడిపోవడం వరకు మొత్తం ఈ క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దే వేచి ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం సముద్రుడు ఇలా అభిషేకిస్తూ శివుని అర్థిస్తూ ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.
కొలియాక్ సముద్రంలో ఉన్న ఈ శివాలయం ఉదయం సముద్రంలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి జరిగి ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఆ పరమ శివుడ్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం.