మన దేశంలో హిందువుల ఆరాధ్య దైవం ఎవరో తెలుసా ?

VAMSI
హిందువులు సహజంగా ఎక్కువ దైవ భక్తిని కలిగి ఉంటారు.  విగ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి శివుడు ఇలా వివిద దేవుళ్ళను  కొలుస్తుంటారు. వారి వారి ఇష్టదైవాలకు ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు. అయితే మన భారతదేశంలో ఏ దేవుళ్లు ఎక్కువగా పూజించబడుతున్నారో అన్న విషయం ఎవరికీ తెలిసుండకపోవచ్చు. అయితే ఈ అంశంపై ఇండియాలో రీసెర్చ్ జరిపింది అమెరికాకు సంబంధించిన పీవ్ రిసెర్చ్  సెంటర్. మన భారతదేశంలో వివిధ మతాలపై ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వే అనునది 2019 మరియు 2020 మధ్య అధ్యయనం జరగగా 2021 జూన్ 29న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం భారత దేశంలోని 89 శాతం మంది హిందువులు ఎంత స్వేచ్ఛగా తమకిష్టమైన దేవుణ్ణి ఎంచుకున్నట్లు తెలిసింది. 


కేవలం ఐదు శాతం మంది హిందువులు మరియు ముస్లింలు మాత్రమే మతపరమైన వివక్షతను చూపుతున్నట్లు తెలిసింది. ఇక ఈ సర్వే అందించిన నివేదిక ద్వారా ఏ దేవుడికి ఎక్కువ మంది నీరాజనాలు పలుకుతూ భక్తిశ్రద్ధలతో పూజా పునస్కారాలు చేస్తున్నారంటే, అందులో ముందుగా మహా శివుని పేరు వినిపిస్తోంది. మన దేశంలో  45   శాతం మందికి పైగా భక్తులు ఆ పరమ శివుడిని ఇష్టదైవంగా ఆరాధిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈయన ఎక్కువ మంది భక్తుల భక్తిని పొందిన అగ్ర దేవుడిగా పూజలందుకుంటున్నారు. ఇక ఆ తర్వాత హనుమంతుడు, విగ్నేశ్వరుడు, లక్ష్మీ, కృష్ణ భగవానుడు, రాముడు కాళికామాతలు జాబితాలో ముందువరుసలో ఉన్నారు.


ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే రాముని యొక్క పరమభక్తుడైన హనుమంతునికి రాముని కన్నా కూడా ఎక్కువమంది భక్తులు ఉన్నారు. గణాంకాల ప్రకారం రామునికి 15శాతం మంది భక్తులు ఉండగా... హనుమంతుడ్ని  మొత్తంగా 32 శాతం మంది భక్తులు ఇష్ట దైవంగా  పూజలు చేస్తున్నారు. ఇలా మన దేశంలో అత్యధికులు శివుడిని ఆరాధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: