రాబోయే యోగిని ఏకాదశికి ఇలా చేయండి... ఇక అంతా శుభమే ?
అయితే ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయం 5:29 నుండి ఉదయం 8:16 గంటల మధ్యన అమృత గడియలుగా చెబుతున్నారు. ఈ సమయంలో విష్ణువుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి శుభ సమయం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానమాచరించి, కొత్త వస్త్రాలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుని ఆ దేవుడిని పవిత్రమైన మనసుతో పూజించాలి. బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్య వస్తుందో తెలిసిందే.
అయితే ఈ యోగిని ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి దేవుని నిర్మలంగా పూజించే వారికి 88 వేల మంది బ్రాహ్మణులకు భోజన్మ పెట్టినంత పుణ్యం వారికి దక్కుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా మనం తెలియక చేసే తప్పులు కూడా తొలగిపోతాయని వాటిని దేవుడు క్షమిస్తాడు అని చెప్పబడుతోంది. కావున రాబోయే యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పూర్తి విశ్వాసంతో భక్తితో దేవుని పూజించి ఆ దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు.