అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Divya

అక్షయ తృతీయ కు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం..
బంగారం మొట్టమొదటిసారి భూలోకంలో గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజు అక్షయ తృతీయ గా జరుపుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికి బంగారం కు పండుగ ఏమిటి ? అని సందేహం కలగవచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం..బంగారాన్ని హిరణ్మయి అని కూడా పిలుస్తారు. అంటే విష్ణువు హిరణ్యగర్భుడు. గర్భం నందు బంగారం కలిగిన వాడు అని అర్థం.

ఈ బంగారం మహావిష్ణువు  ప్రతి రూపం కాబట్టి, అందుకే బంగారం అంత పూజనీయమైనది. ఇక దీని జన్మదినమైన అక్షయతృతీయ అందరికీ పండుగే.. ఇక అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా, శాశ్వతంగా ఉండగలిగేది అని అర్థం.. అందుకే ఈ రోజు బంగారం కొంటే, ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారు ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం  కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు.

అంతేకాకుండా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. దీనిని సద్వినియోగం చేసుకొని అనంతమైన పుణ్య ఫలాలు అందుకోవాలని అందరూ కోరుకుంటారు. అందుకే ఈ రోజు చేసే పుణ్య కార్యాలను  అక్షయం చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. ఈ రోజు చేసే దానాలు శ్రీ మహావిష్ణువుని సంతృప్తి పరచి, అక్షయ సంపదను కలుగజేస్తాయి.. అంతే కాకుండా ఈ రోజు పరశురామ జయంతి గా కూడా కొలుస్తారు. ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటూ పరిష్కారం కావాలని అనుకుంటారో, అలాంటివారు పరశురామ స్తోత్రాన్ని ఈరోజు నుంచి ఒక మండల కాలం పారాయణం చేసినట్లైతే అద్భుత ఫలితాలు పొందవచ్చు..

ముఖ్యంగా స్త్రీలు ఈ రోజంతా ఉపవాసం ఆచరించి, రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం మొదలైనవి పారాయణం చేసినట్లైతే , సౌభాగ్యవతి గా, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి.. ఇక అంతే కాకుండా చల్లని పానీయాలు అయిన కొబ్బరినీళ్లు, తేనే, చెరకు రసం , గోక్షీరం మొదలైన వాటితో అమ్మవారికి అభిషేకం చేసి, వాటిని గృహమంతా చిలకరించినట్లయితే ఆయురారోగ్యాలతో పాటు ఆనందంగా జీవించగలుగుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: