శ్రీవారి భక్తులకు శుభవార్త.. వారికి రెండు గ్రాముల బంగారం..?

praveen
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతి గాంచినదో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.  ఇక తిరుపతిలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీవారిని దర్శించుకుంటే తమ జన్మ ధన్యం అయింది అని భక్తులు భావిస్తుంటారు. అయితే అటు టీటీడీ అధికారులు కూడా భారీగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఒకప్పుడు పెళ్లి చేసుకునే పేద జంటలకు  కల్యాణమస్తు కార్యక్రమం లో భాగంగా టిటిడి బోర్డు పట్టు వస్త్రాల తో పాటు మంగళ సూత్రం లాంటివి అందిస్తూ ఉండేది. అయితే ఆ తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. కానీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించేందుకు సిద్ధమైంది . పదేళ్ల క్రితం నిలిచిపోయిన కల్యాణమస్తు కార్యక్రమానికి మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమైన టీటీడీ బోర్డు.  ఇక కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా ఒక్కటయ్యే జంటలకు అందించే తాళిబొట్టు ను రెండు గ్రాములకు పెంచనున్నట్లు తెలుస్తోంది.


 2007 నుంచి 2011 వరకు తిరుమల శ్రీవారి సమక్షంలో పేద హిందువులు సామూహికంగా వివాహం చేసుకునేందుకు   అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. కానీ ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మరోసారి కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మే 28 అక్టోబర్ 30 నవంబర్ 17 వ తేదీల్లో కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించిందని ఆలయ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: