సూర్య దేవుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకుంటాయో తెలుసా...?
ప్రతి మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు సత్యాస్వ రథంపై తిరుగుతాడు. సూర్యుని కాంతి ఏడు వర్ణాల కలయిక అని మనకు తెలిసిందే. అందుకే ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తాడని వేదాలు వల్లిస్తున్నాయి. ఈ ఏడు గుర్రాలకు పేర్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే 1) గాయత్రి 2) త్రిష్ణుప్పు 3) అనుష్టుప్పు 4) జగతి 5) పంక్తి 6) బృహతి 7) ఉష్ణిక్కు..వీటినే చంధస్సులంటారు. అంతే కాకుండా హిందువులు ఆచరించే క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహించడం జరుగుతుంది. ఈ రథానికి ఉన్న ఇరుసు...పగలు మరియు రాత్రి సమయాలకు గుర్తుగా చెబుతున్నారు.
రధ చక్రాలకు ఉండే ఆరు ఆకులు ఋతువులకు మరియు ధర్మానికి గుర్తుగా చెబుతున్నారు. ఈ విధంగా సూర్యుని రథానికి మరియు రథ సారధికి ప్రాముఖ్యతను చెబుతున్నారు. సూర్యునికి ప్రతి రోజూ ఉదయాన్నే పూజ చేయడం వలన ఆయన మీపై తన దయని కలిగి ఉంటాడని చెబుతారు. అంతే కాకుండా మీకు ఎటువంటి కుటుంబ సమస్యలు ఉన్న వాటికి సత్వర పరిస్కారాన్ని చూపుతాడని భక్తులు నమ్ముతున్నారు.