హోలీ పండుగకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా...?
మరో ప్రాముఖ్యత ఏమిటంటే దీపావళి తరువాత అంత ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇంత అద్భుతమైన హోలీ పండుగ మర్చి 28 వతేదీన మరియు 29 వతేదీన వచ్చింది. ఇప్పుడు మనం హోలీ అంటే ఏమిటి? హోలీ రోజున రంగులను ఎందుకు చల్లుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాము. హోలీ అంటే అర్ధం అగ్నితో పునీతమైనదని అర్ధం. దీనినే హోలీకా పూర్థిమ, కాముని పున్నమి, డోలికోత్సవం గా పిలుస్తారు. ఈ సారి హోలీ పండుగలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ హోలీలో సర్వార్ధ సిద్ధి యోగాలతో పాటు అమృత సిద్ధి యోగా కూడా ఉంటుంది. హోలీ పైన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం రాక్షస రాజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించడానికి, అతని సోదరి అయినా హోలికను రప్పిస్తాడు.
ఎలాగైనా ప్రహ్లాదుడిని మంటల్లో కలిపేయాలి ఆమెను ఉసిగొలుపుతాడు.అప్పుడు హోళికా ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చువు పెట్టుకుని మంటల్లో దూకేస్తోంది. అయితే విష్ణువు ప్రహ్లదుడిని రక్షించడంతో, కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే పడి చనిపోతుంది. కాబట్టి ఆమె మరణానికి ప్రతీకగా హోలీ అనే పేరు వచ్చింది. అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో ‘హోలీక దహనం' నిర్వహిస్తారు. అంతే కాకుండా మరో కథ ప్రకారం, శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో కలిసి పువ్వులతో మరియు రంగులతో అడ్డుకోవడాన్ని డోలికోత్సవం గా పిలుస్తారు.