సంస్కారాల వలన కలిగే లాభమేమిటి ?

Durga
 మానవుడు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి చేసే పనిని సంస్కారమని అంటారు. మనువు మొదలగు వారు చెప్పిన సంస్కారాలు గర్భాదానముతో ప్రారంభమయ్యి పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌల, ఉప నయన, వేదవ్రతములు, స్నాతకం, వివాహం ఆఖరిగా అంత్యేష్ఠి(దహనక్రియ) తో పూర్తవుతాయి. ఇక వీటి వలన లాభమేమిటంటే పుంసవనము, సీమంతము, జాతకర్మల వలన గర్భమందున్న దోషాలు, అధర్మ మూలక, సంగమదోషాలు, వంశపరంపరంగా వచ్చే బీజగతదోషాలు నశిస్తాయి. నామకరణము, చౌలాంతము వంటివి పిల్లల ఆయువు- తేజస్సు, బలమును పెంపొందింపచేస్తాయి. వివాహం మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: