
శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండడానికి గల ఆంతర్యం ఇదే... !
మహా శివరాత్రి నాడు భక్తి శ్రద్దలతో పూజ చేసి ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధించడం వల్ల తమకు మంచి భర్త వస్తారని మహిళలు నమ్ముతారు. ఎవరికైనా చాలా కాలం నుండి వివాహం జరగకపోతే ఉపవాసం చేయడం వల్ల ఆ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.ఇలా ఉపవాసం చేస్తే దేవుడి ఆశీర్వాదం దొరుకుతుందని, వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలానే శివునికి పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల జీవితం లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట.మహాశివరాత్రి రోజున, ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని ఉపవాసం ప్రారంభించండి. మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది.. !!