వేద మంత్రాలు వింటే అంత లాభమా...?

VAMSI
పూర్వం వేద కాలంలో పీఠాధిపతులు, అవ ధూతలు, స్వాములు, మహర్షులు మిగతా సత్యాన్ని తెలుసుకున్న స్వాములకు అందరికీ వేదాలు తెలిసి ఉంటాయి. వీరిలో కొంత మందికి పూర్తిగా తెలిసి ఉండక పోవచ్చు. అయితే వేదాలు చదివిన వారికే కాదంట, వేదాలు విన్న వారికి కూడా చాలా లాభం చేకూరుతుందని అదే వేదాలు చెబుతున్నాయి. అయితే కేవలం వేదాన్ని విన్నంత మాత్రాన ఎలా మనకు లాభం కలుగుతుంది అనే సందేహం మీకు రాక మానదు.

ఉదాహరణకు మన అమ్మ మన చిన్నప్పుడు నిదురపోవడానికి జోల పాడుతుంది. కానీ అంత వయసులో మనకు అది అర్ధం కాదు. కానీ దాని వలన మనము నిదుర పోతాము. అదే విధంగా ఒక వేద మంత్రాన్ని ఉచ్చరించనవసరం లేదు కేవలం దానిని విన్నా కూడా దాని ప్రభావం మనపై ఉంటుంది. ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు మన చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ శబ్ద తరంగాలు మంచి కలిగించే భావాలను పెంపొందించి, చెడు కలిగించే భావాలను తరిమి కొడతాయి.

మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న చెడు భవనాలను తరిమివేస్తుంటే, అదే మనం కనుక ఆ వేద మంత్రాలను చెప్పగలిగితే మరింత శక్తివంతమైన మంచి భావాలను సృష్టించుకోగలము. మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది. అదే విధంగా కేవలం మంత్రోచ్ఛారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం దృష్టిని నిలుపగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా ఆ మంత్రం పలకడం వలన మనము సంపూర్ణంగా లాభం పొందుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: