ఆధ్యాత్మికం: సాయి బాబా మహిమలివే...?

VAMSI
హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో సాయిబాబా కూడా ఒకరు. వాస్తవానికి సాయిబాబా ఒక సాధువు... ఒకప్పుడు మనుషులతో కలిసి జీవించిన యోగి. అయితే ఆయన మహత్యాలు మరియు మహిమల గురించి తెలుసుకున్న ప్రజలు ఆయన్ని  ఆరాధించడం మొదలు పెట్టారు. మన కోసం ఈ భూమిపై వెలసిన దైవమని నమ్మారు. శ్రీ సాయి నాధుని జీవిత చరిత్ర ఒక మహా అద్భుతమైన.. ఆశ్చర్యకరమైన లీల. సాయిబాబాను  హిందువులు, ముస్లింలు కూడా కొలుస్తారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. హిందువులు సాయిబాబాను శివుని, దత్తా త్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి.
కాబట్టి బాబా భక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఆగ్రహానికి లోను కాకూడదని చెబుతుంటారు. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్,  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. సాయిబాబా  మహిమలు అత్యంత అద్భుతం. సాయి సచ్చరిత్రలో సాయి లీలలు ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, భక్తుల సమస్యలను ముందుగానే గ్రహించి వారి కోరికను నెరవేర్చడం వంటివి చేశారు. సాయిబాబా ఎప్పుడూ ఆర్భాటంగా నడుచుకోలేదు.
ఆయన ఒక ఫకీర్ లానే తిరుగుతూ ప్రజల కష్టాలను గ్రహించి వాటిని రూపు మాపేవారు. బాబాకి గురువారం అంటే చాలా ఇష్టమైన రోజని అందరికీ తెలిసిందే. ఆరోజు బాబా విగ్రహానికి ఆవు పాలతో పాలాభిషేకం చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పూజలో ఉంచాలి. బాబాకు తెల్లటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. చపాతీని కానీ, కిచిడీని కానీ, పండ్లను కానీ బాబాకి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల సాయిబాబా మనసు సంతృప్తి చెందుతుందని ఆయన చల్లని చూపు మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈరోజు ఆయన భక్తిలో ఈరోజు ధన్యులు కండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: