అస్తమించే సూర్యడు, ఉదయించే సూర్యుడంతటి శక్తి గలవాడా ?

Durga
మన పూర్వులు గమినించినదేమిటంటే అస్తమించే సూర్యడు ఉదయించే సూర్యుడంతటి శక్తి కలవాడు కాదని ఈ వాస్తవాన్ని సాయంత్రం ఆకాశం సూర్యుని దిక్కు ఎర్రబడి ఉండటం ద్వారా నిరూపితపరిచారు. ఆధునిక శాస్త్రం సైతం ఈ విషయాన్ని అంగీకరించింది. సూర్యకిరణాలు ప్రయాణం చేస్తున్నప్పడు భూమిని ఆవరించి ఉన్న గాలి ఆవరణ గుండా పోతాయి. అలా అవి గాలియెక్క పరమాణువులతో ఢీకోని వ్యాపిస్తాయి. తక్కువ ప్రసరణా సామర్ధ్యమున్న కాంతి అలా గాలి పరమాణువులతో ఢీకొని వ్యాపిస్తాయి. అలాగే ఎంత ఎక్కువ దూరం కిరణాలు గాలి ఆవరణం గుండా ప్రయాణం చేస్తాయో, అన్ని ఎక్కువ కిరణాలు గాలి పరమాణువులను ఢికొని వ్యాపిస్తాయి. అస్తమించ సూర్యుడి కిరణాలు నడిమధ్యాహ్న సూర్యకిరణాల కంటే పదహారు రెట్లు సుదూరప్రయాణం చేస్తాయి. అలా అస్తమించే సూర్య కిరణాలు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల గాలితో రాపిడికి గురై ఎక్కువగా వ్యాపిస్తాయి.  ఎక్కువ ప్రసరణా సామర్ధ్య మున్న(wave length) ఎర్రని కిరణాలు మాత్రం అలా వ్యాపించవు. ఈ ఎర్రని కిరణాలు మనకంటిపై పడి అస్తమించే సూర్యుడు మనకు ఎర్రగా కనిపిస్తాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: