అయ్య‌ప్ప‌: అయ్యప్పస్వామి వాహనం పులి కాద‌ని మీకు తెలుసా..?

frame అయ్య‌ప్ప‌: అయ్యప్పస్వామి వాహనం పులి కాద‌ని మీకు తెలుసా..?

Kavya Nekkanti

శబరిమల.. కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. స్వామియే శరణం అయ్యప్ప.. కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠ‌ల‌తో 41 రోజుల పాటు మండలదీక్ష చేసి.. శబరిమలలో కొలువై ఉన్న అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శ‌కుంటారు. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠిన‌త‌రంగా ఉన్న‌ప్ప‌టికీ.. భ‌క్తులు ఏ మాత్రం వెనుక‌డుగు వెయ్య‌రు. 

 

ఈ క్ర‌మంలోనే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు, మాలధరించి, ఇరుముడి మోసుకొని, పంపలో స్నానమాడి, శరణఘోషతో శబరిమల చేరి ఒక్క సారి శ్రీధర్మశాస్తాను, మణికంఠుని దర్శించాలన్న కోర్కెతో 18 మెట్లెక్కి వస్తుంటారు. కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అయ్య‌ప్ప‌స్వామి వాహ‌నం ఏంటి..? అని అడ‌గ‌గానే ట‌క్కున పెద్ద పులి అని చెప్పేస్తారు. కానీ, అయ్య‌ప్ప‌స్వామి వాహ‌నం పుదు కాదు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు. పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: