తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: లేదు ఈరోజు తేదీ 20.11.2017 సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.సర్వదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా 1 గంటలలో దివ్య దర్శనం పూర్తవుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.
నిన్న నవంబరు 19 న 79,496 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.నిన్న 29,968 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.82 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు
అన్న ప్రసాదం ట్రస్టు: ₹ 2.11 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు
ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 5.00 లక్షలు
ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు
విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు
ఆదివారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు : 3
₹ 50 గదులు ఖాళీలు : 5
₹ 100 గదులు ఖాళీలు : 10
₹ 500 గదులు ఖాళీలు : లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు : 200
సహస్రదీపాలంకరణ ఖాళీలు : 240
వసంతోత్సవం ఖాళీలు : 150
సోమవారం ప్రత్యేక సేవ:
విశేష పూజ
ఈ రోజు 20.11.2017 సోమవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం)
ఉ. 5.30 - 6.30
ప్రత్యేక సేవ:
విశేష పూజ
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30 ఏకాంతసేవ
ఓం నమో వేంకటేశాయ నమః
ఓం పద్మావతీదేవ్యై నమః
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము
రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
భృంగావళీచ మకరంద రసానువిద్ధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ !! 10
తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.