స్ఫటిక లింగంపై శ్వేతనాగు..! శ్రీకాకుళం జిల్లాలో అద్భుతం..!!
శ్రీకాకుళం జిల్లాలో అద్భుతం జరిగింది. పొందూరు మండలంలోని ఆనంద ఆశ్రమంలో భక్తులకు వింత అనుభవం కలిగింది. స్థానికంగా ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి శ్వేతనాగు ప్రవేశించింది. చాలాసేపు స్ఫటిక లింగంపై అలాగే ఉండిపోయింది.
శ్రావణమాసం వేడుకల్లో భాగంగా భక్తులు పూజలు చేస్తున్న సమయంలో అక్కడికివచ్చిన శ్వేతనాగు లింగం పైభాగంలో పడగ విప్పి కూర్చుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు ఎంతమంది వచ్చినా పాము భయపడకుండా అలాగే ఉండిపోయింది. 4 గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా శివమహత్యమేనని భక్తులు ఆనందపరవశులయ్యారు. శ్రావణమాసం రెండో రోజైన మంగళవారం ఈ వింత జరిగింది.