శ్రీశంకర భగవానుని పన్నెండు లింగాలలో పదవది త్య్రంబకేశ్వరుని స్థానం గౌతమీ నదీతటంలో గల ఈ దివ్య జ్యోతిర్లింగం ఒక విచిత్ర రూపంలో కానవస్తుంది. ఈ ఆలయ గర్భగుడిలో ఇతర గుడులలోలా శివలింగంపై జలహరి (అర్ఘ్యం) ఉండదు. ఆ స్థానంలోనే ఒక రోలువంటి గొయ్యి ఉంది. ఈ గోతిలో బొటన వ్రేలి ఆకారంలో మూడు లింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి లింగాలు, కలసి త్య్రంబకేశ్వరుడు అని అర్థం. ఈ మూడింటిలో మహేశ్వరుని లింగంపై నీరు ఎల్లప్పుడూ కారుతూ ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగా నిరంతంరం సాగే అభిషేకం.
ఈ జ్యోతిర్లింగం నుంచి కొన్నిసార్లు సింహగర్జన వినిపిస్తుంది. కొన్నిసార్లు పెద్దమంటలు కనిపిస్తాయి. అటువంటప్పుడు శివుడి కోపం నుండి తప్పంచుకునేందుకై గంజాయి కలిపిన పాలను లింగంపై పోసి రుద్రాభిషేక మంత్రాలతో శాంతి చేస్తారు. గిన్నెడు పాలూ లింగంపై పోసేస్తారు. అపుడు సింహగర్జన తగ్గాక, దేవుడు శాంతించినట్లు భావిస్తారు. ఈ విధంగా ఇక్కడి అలౌకిక దివ్య జ్యోతిర్లింగం ఇక్కడ ఏ విధంగా ఉద్భవించిందో ఈ క్రింది కథ ద్వారా తెలుసుకుందాం.
అహల్య భర్త అయిన గౌతమి మహాముని దక్షిణ బ్రహ్మ పర్వతంపై తపస్సు చేస్తూ ఉండేవాడు. అక్కడ వంద ఏళ్ళుగా వానలు కురవనందువల్ల భూమి బీళ్లు వారింది. నకస జీవాలూ నీళ్లు లేనందువల్ల క్షీణింపసాగాయి. అక్కడి మునులు, నివాసులూ, పశుపక్ష్యాదులూ అన్నీ కూడా ఆ స్థానం విడిచి వలసపోనారంభించాయి. ఈ ఘోర అనావృష్టిని చూసి గౌతముడు ఆరు నెలలపాటు ప్రాణాయామ ద్వారా మాంగళిక తపస్సునారంభించాడు. దీనితో అత్యంత ప్రసన్నుడైన వరుణదేవుడు ప్రత్యక్షంకాగానే, జలం కావాలని గౌతముడు వరంపొందాడు. వరుణ దేవుని ఆదేశానుసారం గౌతముడు తన చేతిలో ఒక లోతయిన రంధ్రం చేశాడు. అందులోంచి వరుణదేవుని అద్భుత శక్తివల్ల నీరు నిండనారంభించింది. "నీ పుణ్యవశాన, ఈ నీరు ఇలాగే ఎప్పుడూ అక్షయంగా ఉండే తీర్థంగా మారుతుంది. నీ పేరు మీదే ప్రసిద్ధికెక్కి. యజ్ఞ, దాన, తప, హోమాలు మరియు దేవతల పూజలకూ నిలయం అవుతుంది. సత్ఫలితాలనిస్తుంది." అని దీవించాడు. ఈ జలాలను పొంది, ఋషులు యజ్ఞానికై వాంఛిత బ్రీడికను ఉత్పత్తి చేయటం ఆరంభించారు.
ఒకసారి గౌతమముని శిష్యుడొకడు ఆ గోతి నుండి నీటిని తీసుకోబోతే, అదే సమయానికి కొంత మంది ఇతర ముని పత్నులు కూడా నీటికై అక్కడికే వచ్చారు. ముందుగా తామే నీరు తీసుకుంటామని పట్టుపట్టారు. గౌతముని శిష్యులు, గురపత్నిని పిలిచి తగవు తీర్చవలసిందిగా కోరారు. ఆమె శిష్యులే ముందు తీసుకోవాలని నిర్ణయించింది. మునిపత్నులు ఇది తమకు అవమానంగా భావించి, తమ భర్తలకు పితూరీ చేసేప్పుడుకొన్ని అబద్ధాలు కూడా జోడించారు. గౌతమునిపై ప్రతీకారం తీర్చుకోడానికి మునులు గణపతిని ప్రార్ధించారు. వినాయకుడు ప్రత్యక్షం అయి వరం కోరుకోమన్నాడు. వారు గౌతముడు అరిష్టదాయకుడనీ, అతడిని అక్కడి నుండి తరిమివేసే శక్తి తమకు కావాలనీ కోరుకున్నారు.. మీకు నీటిని రప్పించి, కష్టాలను దూరం చేసిన గౌతముడిని ఈ విధంగా అవమానించవద్దని గణేశుడు వారిని పట్టుపట్టువద్దని కోరాడు. కానీ మునివరులు వినిపించుకోలేదు. గణేశుడు వారికి వరం ఇస్తూ గౌతముని వంటి మహాత్ముడిని అవమానిస్తే కలిగే దుష్పరిణామాలను భరించవలసి ఉంటుందని వారిని హెచ్చరించాడు.
ఒకరోజు గౌతముడు వ్రీహి తీసుకోవడానికి వెడితే అక్కడ ఒక చిక్కినపోయిన ఆవు కనిపించింది. ఒక పుల్లను తీసుకుని ఆవును అదిలించబోతే, ఆ ఆవు వెంటనే క్రిందపడి మరణించింది. అంతే, ఇంకేముంది? మిగతా మునులకు గౌతముణ్ణి బహిష్కరించటానికికొక సాకు దొరికింది. ఆయనకు గోహత్యాపాతకాన్ని అంటగట్టి, దుర్భాషలాడి అవమానించారు. అక్కడి నుండి వెళ్లిపొమ్మన్నారు. గౌతముడు ఎంతో ఖిన్నుడై ఆత్మగ్లానితో ఆ స్థానాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ గోహత్యాపాప శమనానికై, మునులు సూచించిన ప్రకారంగా తన తపోబలంతో గంగను తెచ్చి అందులో స్నానం చేసి, కోటి చొప్పున పార్థివ లింగాలను తయారు చేసి పూజింపనారంభించాడు. ఈ పూజలకు శివుడుమెచ్చి, గతముడిని మహాత్ముడవని ప్రశంసించాడు. అతడికి అన్యాయం జరిగిందని గ్రహించాడు. నీవెలాంటి పాపమూ చేయలేదని అతడిని ఊరడించాడు. గౌతమునికి శివుడు కొన్ని వరాలు ప్రసాదించాడు. గౌతముడు ప్రపంచానికి గంగనిచ్చి, విశ్వసౌఖ్యాన్ని కలిగించమని కోరాడు. శివుడు గంగ యొక్క తత్వరూప అవశిష్టజలాన్ని మునికి ఇచ్చాడు. లభించిన గంగను గౌతముడు గోహత్యాపాతకం నుండి విముక్తి నివ్వమని ప్రార్థించాడు. గౌతముడిని పవిత్రం చేశాక, గంగ తాను తిరిగి స్వర్గానికి వెళ్లిపోతాననే కోరికను తెలియపరిచింది. కానీ, శివుడు, కలియుగం అయ్యే వరకూ ధరిత్రిపైనే ఉండమని ఆదేశించాడు. అప్పుడు గంగ 'మీరు పార్వతీసమేతంగా భూమిపై ఉండండి' అని కోరింది. ప్రపంచ సౌఖ్యానికై గంగ కోరికను మన్నించాడు శివుడు.
గంగ శివుడ్ని, తన గొప్పతనం లోకానికి ఎలా తెలుస్తుందని అడిగింది. అప్పుడు ఋషులు, "గురువారం సింహరాశిపై ఉన్నంతకాలం, మేమందరూ ఈ నదీతటంపై నివశిస్తాం. నిత్యం, మూడు పుటలా నీ నీటిలో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటాం. దీనివల్ల మా పాపాలు నశిస్తాయి". అన్నారు. ఇది విని గంగా, శివులు అక్కడ స్థిరపడ్డారు. గంగా గౌతమీ నామంతోనూ, లిగంత్ర్యంబక నామంతోనూ ఈ స్థలం విఖ్యాతం అయింది. గోదానం చేసే నది గోదావరి అయ్యింది. గౌతమునికై వచ్చిన గంగ గౌతమీ గంగ అయింది. అది బ్రహ్మగిరి నుంచి వచ్చిన సుముహూర్తం -కూర్మావతారానంతరం వరాహావతారం ఎత్తబోయే నడుమగల సంధిపూర్వక, గురుసింహరాశిలో (సింహస్థ) ఉంటాడు. అప్పుడు మాఘశుద్ధ దశమి, గురువారం మధ్యాహ్నవేళ గంగ ప్రత్యక్షం అయ్యింది.
బ్రహ్మ, విష్ణువులతో కూడి శివుడు త్ర్యంబకేశ్వరునిగా దివ్య జ్యోతిర్లింగ రూపధారణతో భక్తుల కల్యాణానికై అక్కడ వెలశాడు. ఈ బ్రహ్మగిరి ప్రదేశం కూడా లింగమూర్తిలా అగుపిస్తుంది. ఆ శిఖరంమీంి పావన గౌతమమీ గంగం నీరు జలజలా ప్రవహిస్తుంది. బ్రహ్మగిరిలో ఏ ధారనుంచి గోదావరి ప్రవహిస్తుందో, ఆ ద్వారాన్ని గంగాద్వారం అంటారు. ఇక్కడ ఒక గోముఖం నుండి గంగనీరు నిత్యం ప్రవహిస్తూంటుంది. గోదావరీమాత గుడికూడా ఇక్కడే ఉంది. ఆలయంలో మాత యొక్క ప్రసన్న విగ్రహం ఉంది. దీని దగ్గరే వరాహతీర్థం ఉంది.
గంగాద్వారం దాటి గోదావరి ముందర కొంచెం దూరంలో సన్నబడిపోతుంది. మాయమైన గోదావరి తిరిగి తహల్వటీలో ప్రత్యక్షం అవుతుంది. అక్కడి నుంచి తిరిగి మాయమైపోకండా, గౌతమ ముని నాలుగు దిక్కుల్లో దర్భలు విసిరివేశాడు. దానితో ఇది కూశావర్తిలోనే ప్రవహిస్తూంటుంది. ఈ కుశావర్తి మహాతీర్థం 27మీర్ల వర్గాకారంలో ఉంటంది. ఈ పావన తీర్థం గట్టిది. ఈ కోనేరు చుట్టూరా ఎక్కి, దిగడానికి అనువుగా మెట్లున్నాయి.
సింహ స్థపర్వంలో ప్రతి పన్నెండు ఏళ్ళకూ ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. లక్షలాది ప్రజలు ఈ కుశావర్తి నదిలో స్నాం చేసి పవిత్రులం అయ్యామని భావిస్తూ ఉంటారు. ఈ కుశావర్తి కోనేరు నలువైపులా వరండాలు ఉన్నాయి. ఇందులో సుందర విగ్రహాలు ఉన్నాయి. బ్రహ్మగిరి తల్హటీలో కుశావర్తి వద్ద గంగాసాగర్ అనే చెరువు ఉంది. దీని దగ్గరే నివృత్తి నాథుని సమాధి, గోరక్ష గుహ ఉన్నాయి. జ్ఞానేశ్వర్ అనే ఆయన ఆలందీలో సమాధి పొందిన అనంతరం పెద్దన్నకు ముందే ఇహలోకం నుండి పరమపదించాడు. దీనితో నివృత్తి నాథుడు ఉదాసీనుడయ్యాడు. కొంతకాలం తరువాత తన గురువైన గహినీనాథుడు ఈ తపోభూమిలో సమాధిపొందాడు. ఈ గుహలో గహినీ నాథుడు నివృత్తినాథునికి నాథవంథ దీక్షనిచ్చాడు. ఈ గుహలోనే శ్రీదత్తభగవానునికి సిద్ధి ప్రాప్రించిందని అంటారు. దగ్గర్లో నీలపర్వతంతో నీలాంబికా స్థాం ఉంది. అంజలీ పర్వతంపై హనుమంతుని తల్లి అయిన మాతా అంజనీదేవి తపస్సు చేసింది.
బ్రహ్మగిరిలోని ఒక పర్వతంపై గల కోట ఒకటి నేడు శిథిలావస్థలో ఉంి. ఎన్నో ఏళ్ల కిందట దీనిని దేవగిరి యాదవులు నిర్మించారు. తరువాత కాలంలో మొగలాయి, మరాఠా, నైజామ్, పిష్వా, ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది. దేశం స్వాతంత్ర్యం పొందాక కూడా ఇది ఇంకా శిథిలావస్థలో నేటికీ ఉంది. ఈ బ్రహ్మగిరి చుట్టి రావడం చాలా పుణ్యకార్యంగా భావింబడుతుంది. తమ సౌలభ్యానుసారం 1, 21, 31 మార్లు ప్రదక్షిణ పుణ్యగా భావిస్తారు.
ప్రదక్షిణ మార్గంలో రామతీర్థం, ప్రయోగతీర్థం, నృసింహ తీర్థం, మొదలయిన సుందర స్థానాలున్నాయి. పీష్వా శ్రీమాన్ లు ప్రతి 25అడుగుల దూరంలో చెట్లను నాటించారు. పీష్వాల శాసనకాలంలో నేరస్థులను బ్రహ్మగిరి ప్రదక్షిణ చేయమని శిక్షిస్తూ ఉండేవారు.
త్య్రంబక పట్టణం సముద్రతటానికి సుమారు పదేహేను వందల అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ చక్కని గాలి వీస్తుంది. దానికి తోడు పవిత్ర తీర్థస్థానం కూడాను. త్ర్యంబకేశ్వర దేవుని గుడి శ్రీమాన్ నానా సాహెచ్ పీష్వా కట్టించాడు. గుడికి నలువైపులా రాతి స్తంభాలపై సుందరమైన చెక్కడాలున్నాయి. ముఖ్యాలయం ముందర నందీశ్వరాలయం కూడా ఉంంది. ఆ రోజుల్లో ప్రతి రోజూ నౌబత్ ఖానాలో నగరాలు వాయించే ఏర్పాటు ఉండేది.
త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో నిత్యపూజ, హారతి, ప్రసాదం చేసేందుకై ఏర్పాట్లున్నాయి. విశేష సమయాలలో దేవుడిని చక్కని వస్త్రాలు, నగలతో అలంకరిస్తారు. రత్న ఖచితమైన కిరీటం ధరింపచేస్తారు. ఈ కిరీటం నారో శంకర్ దక్షిణ భారతం ఆక్రమణచేసినపుడు తెచ్చాడు. దీనిని అతడు శంకర భగవానునికి అర్పించాడు. సర్దార్ వించుర్ కర్ జీ దేవునికై ఒక సుందర రథాన్ని కూడా చేయించాడు.
ప్రతి సోమవారం త్య్రంబకేశ్వరుణ్ణి పల్లకీలో, బాజాభజంత్రీలతో బాటు కుశావర్తికి ఊరేగించి తీసుకువెళ్లి, తీసుకువస్తారు. త్య్రంబకేశ్వరం వద్ద గౌతమీ గోదావరిలో అహల్య అనే ఒక చిన్న నది వచ్చి కలుస్తుంది. ఈ సంగమస్థలంలో కొంత మంది నాగానారంబల్-నాగ నారాయణబల్ అనే పేర్లతో ఒక ప్రత్యేక విధిని నిర్వర్తిస్తారు. పూర్వజులు గనుక తీరని కోరికలతో అసంతృప్తులై మరణించి ఉంటే, సంతానం కలుగదనీ, ఈ దోష నివారణకై మరియు కొన్ని కష్టాల నివారణకూ ఈ నాగనారాంబల విధిని చేస్తారు. ఈ పద్ధతి ఉత్తర భారతదేశపు పద్ధతిలో చేయబడుతుంది. దీనిని మ్రొక్కుగా పెట్టుకుని విధిగా నిర్వర్తిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే ఎవరో అన్నారు.
"తత్రగత్వాకురు పితునుద్దిశ్య యత్నతః" అని.
ఈ విధంగా త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగం అపూర్వం, మహిమాన్వితం, పవిత్రం మరియు దివ్యం అయిన తీర్థస్థానం.
'జయ త్ర్యంబకేశ్వర. జయ త్ర్యంబకేశ్వర'.
పదకొండవ జ్యోతిర్లింగం శ్రీ కేదార నాథుడి విశిష్టత, యాత్ర వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://www.apherald.com/Spirituality/ViewArticle/150071/kedharanatha-jyothirlingalu-shivudu-kedaranath-tem/