మహా మృత్యుంజయ మంత్రం..!!

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

యజామహే : పూజించు చున్నాము
సుగంధిం : సుగంధ భరితుడు
పుష్టి : పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి
వర్ధనం : అధికం/పెరగటం పెరుగునట్లు చేయువాడు/పెంపొందించు వాడుఉర్వారుకం : దోసపండు
ఇవ :వలె
బంధనాత్ : బంధాన్ని తొలగించు
మృత్యోర్ : మృత్యువు నుండి
అమృతాత్ : అమృతత్వం కోసం/అమరత్వం కోసం
మాం : నన్ను
ముక్షీయ : విడిపించు.


తాత్పర్యం:  అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేనుపూజించు చున్నాను. ఆయన దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు (అంతసునాయాసముగా లేక తేలికగా) నన్ను అమరత్వం కోసం మృత్యు బంధనంనుండి విడిపించు గాక!


ప్రాశస్త్యం : మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది.క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమశివుడు దిగమింగిమృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆరుద్రుని ఆశీస్సులుపొంది మృత్యుంజయులవుతారు అనినమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్పవచ్చు. అంతేకాక ఆపదలుకలిగినపుడు కూడా దీనిని చదువుకోవచ్చును. సాధారణంగా మూడుసార్లుగాని, తొమ్మిదిసార్లుగాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెఖ్ఖన దీనిని పారాయణంచేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: