హైదరాబాద్ సంస్థాన విమోచనానికి కృషి సలిపిన స్వామి రామానంద తీర్థ.. నేడు జయంతి
1952 నుండి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953లో హైదరాబాదు నగరంలో ప్రప్రథమంగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు స్వామీజీ ఆహ్వానసంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953లోనే గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుండి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతంలో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటన చేశారు. అంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరు చుకొన్నారు.1957 నుండి ఆయన ఉస్మానియా సెనేట్లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. వినోభాజీ ప్రారంభించిన భూదాన్ ఉద్యమాలకు ఆయన చేయూత నిచ్చారు. స్వామీజి 1972 జనవరి 22 వ తేదీన హైదరా బాదులో నిర్యాణం చెందారు.
కొంత కాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ ఎం జోషి కార్మికోద్యమంలో పాల్గొన్నాడు. 1926 లో ఢిల్లీలో ఉండగా పాక్షిక పక్షవాతానికి గురై కొంత కాలానికి కోలుకున్నాడు. తన ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. ఈ దరిమిలా హైదరాబాదు రాష్ట్రంలో హిందువులపై జరుపుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం, హిందూ ఉన్నత పాఠశాల స్థాపపనకు నిరాకరించింది. ఐతే ఓ లొసుగును ఉపయోగించుకుని ప్రాథమిక పాఠశాలను విస్తరించి ఉన్నత పాఠశాల నెలకొల్పాడు. ఆ స్కూల్ ప్రప్రథమ ప్రధానోపాధ్యాయుడిగా రామానంద తీర్థను నియమించడం జరిగింది. 1930 జనవరి 14 లో ఆయన సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికే అంకితమైయ్యారు.