పాపం.. చంద్రబాబు.. దెబ్బ మీద దెబ్బ?
ఇలా ఒక దాని వెంట ఒకటి బాబుకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. హైకోర్టులో అంగళ్ల కేసులో ముందస్తు బెయిల్ కావాలని ఫిటిషన్ వేస్తే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా ముందస్తు బెయిల్ ను హై కోర్టు ఇవ్వలేదు. ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ కావాలని కోరినా బాబుకు నిరాశే ఎదురైంది ఇలా ఎక్కడ చూసిన చంద్రబాబుకు బెయిల్ దొరకడం లేదు. ఇది నిజంగా చంద్రబాబు తో పాటు టీడీపీ శ్రేణులకు మింగుడు పడని అంశం. ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడు 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఎంత ఉన్నా.. కూడా జైలుకు వెళ్లని పరిస్థితి వచ్చింది. అంటే ఎంతటి దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. బెయిల్ పిటిషన్ కింద కేసులో వేశారు.
అది కూడా రిజక్ట్ అయింది. చంద్రబాబు విషయంలో ఒకే ఒక్క ఊరట కలిగించే విషయం ఏంటంటే ఆయనను మళ్లీ కస్టడీకి ఇవ్వకపోవడం. మిగతావి అన్ని ఎదురుదెబ్బలే. సుప్రీంకోర్టులో అక్టోబర్ 3 వ తారీఖు న 17ఏ కింద వెంటనే క్వాష్ అయిపోతుందని భావించారు. అది కాలేదు. ఇవాళ మళ్లీ సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి. వాదనల సమయంలో ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్ వాదనలు విన్న తర్వాత చంద్రబాబు కు బెయిల్ వస్తుందా లేదా అనేది చూడాలి.