NBK111 : ఫ్యాన్స్ కి ఊపు తెప్పించే న్యూస్..మరోసారి అదే అవతారమెత్తనున్న బాలయ్య..!?
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించింది. NBK111గా తాత్కాలికంగా పిలవబడుతున్న ఈ సినిమా మీద ఇప్పటి నుంచే భారీ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారబోతున్నారట!ఇదివరకు దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పైసా వసూల్’ సినిమాలో ఓ పాటను స్వయంగా పాడి బాలయ్య అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆయన గంభీరమైన గళం, మాస్ టోన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో NBK111 కోసం కూడా బాలయ్య తన గళం వినిపించనున్నారని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ అభిమానుల్లో జోష్‌ను పెంచుతోంది. కేవలం పాట మాత్రమే కాదు పాటలో కొన్ని డైలాగ్స్ కూడా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మరోసారి మాస్ అవతార్ ఎత్తబోతున్నాడు బాలయ్య్ అని చెప్పోచ్చు.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. ఈ డ్యూయల్ రోల్ కథకు కీలకంగా ఉండబోతుందని, బాలయ్యను పూర్తిగా కొత్త కోణంలో చూపించనున్నారని టాక్. కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించబడుతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్‌గా లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. బాలయ్య – నయనతార కాంబినేషన్ మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేయనుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, NBK111 సినిమాతో బాలయ్య మరోసారి మాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా అభిమానులకు పండగ తీసుకురానుందని చెప్పొచ్చు.