స్పిరిట్ కోసం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవ్వరు చేయని పని చేస్తున్న సందీప్.. నెవర్ బిఫోర్ ట్రీట్ ప్లాన్ ఇది!
ఇక ఈ భారీ ప్రాజెక్ట్స్‌లో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సందీప్… ఈసారి ప్రభాస్‌తో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
‘స్పిరిట్’ సినిమాను చిత్ర యూనిట్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఖరీదైన, హైటెక్ సెట్లను నిర్మించారు. ప్రతి సీన్ సినిమాటిక్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించేలా సందీప్ రెడ్డి వంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
త్వరలోనే ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సీన్స్ ఏ మాత్రం లీక్ కాకుండా ఉండేందుకు షూటింగ్ స్పాట్‌లో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారట.అందులో భాగంగా షూటింగ్ లొకేషన్‌కి హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ ఫోన్లు కూడా తీసుకురాకూడదని ఒక స్పెషల్ కండీషన్ పెట్టుకున్నారట. అంటే, ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారన్న మాట. ఈ ఒక్క విషయం చూస్తేనే ఈ సీన్స్ ఎంత కీలకమైనవో అర్థమవుతోంది.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడట. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ… అన్నీ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఈ ఫైట్ సీన్‌ను ప్రేక్షకులు జీవితాంతం మర్చిపోని విధంగా డిజైన్ చేశారని టాక్. ముఖ్యంగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఒంటరిగా రెండు వందలకు పైగా ఫైటర్లను ఎదుర్కొనే సన్నివేశం ఉండబోతుందట. ఈ ఫైట్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు.సందీప్ రెడ్డి వంగా మార్క్ రియలిజం, ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్— కలిపి ఈ సీన్‌ను తెరకెక్కిస్తున్నాడట. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫిజిక్, పవర్‌కు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఫుల్ హైప్‌లో ఉన్నారు.