జగన్ అర్జంటుగా ఢిల్లీ వెళ్లింది బాబు కోసమేనా?

Chakravarthi Kalyan
పోలవరం గురించి సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమని ఢిల్లీ అడిగారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను నిధలను విడుదల చేయాలని అడిగినట్లు సమాచారం. 55,458 కోట్ల రూపాయలకు అనుమతి తెలిపింది. అయితే పోలవరం ఫస్ట్ పేజ్ పూర్తి కావడానికి దాదాపు 17,144 కోట్ల రూపాయలు కావాలి. అయితే దీనికి సంబంధించిన నిధులను జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు 12,911 కోట్లకు ఆమోదం లభించడం సంతోషం అని అన్నారు. దీన్ని పున: పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. పోలవరం తొలిదశను పూర్తి చేయడానికి 17,144 కోట్లు అవుతాయని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 1355 కోట్లను రీయంబర్స్ చేయాలని జగన్ కేంద్రమంత్రికి వినతి సమర్పించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు చేసినట్లు చెప్పారు.

అయితే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. దాదాపు రూ. 7359 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందని అన్నారు. దాదాపు 9 సంవత్సరాలుగా ఆంధ్రకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వలేదని వాటిని ఇప్పించాలని కోరారు. అయితే ఢిల్లీలో జగన్ పర్యటన రాష్ట్రానికి నిధుల సేకరణ మీద జరుగుతుంటే కొంతమంది మాత్రం చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఉండేందుకు కేంద్రంలోని ఢిల్లీ పెద్దలను కలుస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మంత్రి రోజాపై కూడా టీడీపీ మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సమయంలో జగన్ ఢిల్లీ వెళ్లడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు  బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయితే ఆయన బెయిల్ రాకుండా అడ్డుకున్నట్లేనని వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: