పాకిస్తాన్‌, ఆఫ్ఘన్‌ గొడవల్లో తలదూరుస్తున్న చైనా?

Chakravarthi Kalyan
అఫ్గానిస్థాన్ లో అమెరికా సైన్యం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ప్రజా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ తాలిబాన్ల పాలన మొదలైంది. అప్పుడు అందరి కంటే ఎక్కువ సంతోషించింది పాకిస్థానే.  అయితే వారికి ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.  భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ నే ఆ దేశం నాశనం చేస్తోంది. అఫ్గాన్-పాకిస్థాన్ లో ఇప్పుడు సరిహద్దు తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో పాటు పాకిస్థాన్ తాలిబాన్లకు అఫ్గాన్ సురక్షిత ప్రాంతంగా ఉంది. దీంతో బలూచస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.  

అయితే ఎప్పుడు ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చాలని చూసే చైనా ఇప్పుడు వీరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోంది. పాక్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి మధ్య భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనా సమావేశం నిర్వహించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, దిగజారిన దౌత్య సంబంధాలను దారిలో పెట్టాలని చైనా భావిస్తోంది.

ఇటీవల పాకిస్థాన్లోని పలు పట్ణణాలు , నగరాలపై అఫ్గాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్ లో శరణార్థులుగా ఉన్న ఆఫ్గాన్ లను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. తమ దేశంలో ఉగ్ర దాడులకు అఫ్గాన్ పౌరులే కారణమని వారి వాదన. అయితే ఆ ఆరోపణలను అఫ్గాన్ తోసిపుచ్చింది.

అయితే తాజాగా ఈ దేశాల మధ్య సమావేశాన్ని ట్రాన్స్- హిమాలయన్ ఫోరం ఫర్  ఇంటర్ నేషనల్ కో ఆపరేషన్ లో భాగంగా జరిగాయి. చైనా మాత్రం అఫ్గాన్ లో ఉన్న ఖనిజ సంపదపై కన్నేసింది. ఇప్పటికే పాక్ లో సీపెక్ ద్వారా పాక్ లో అంతటా రోడ్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అఫ్గాన్ లోని చమురు, లిథియం, మైనింగ్ లపై దృష్టి సారించిన చైనా పాక్, అఫ్గాన్ ల మధ్య శాంతి నెలకొంటేనే తమ దోపిడికి అడ్డు ఉండదని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: