హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన క్లోజ్ ఫ్రెండ్

Vijaya
చంద్రబాబునాయుడు అజెండాను టీడీపీ నేతలకన్నా స్పీడుగా, ఎక్కువగా అమలు చేస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. చివరకు సొంతపార్టీలో వ్యతిరేకత వచ్చినా సరే చంద్రబాబుకు మద్దతుగా నిలవటంలో  రామకృష్ణ వెనకాడలేదు. రాష్ట్రంలోని అన్నీ ప్రతిపక్షాల్లో చంద్రబాబుకు ఫుల్లు సపోర్టుగా నిలుస్తున్నదెవరయ్యా అంటే రామకృష్ణే అని ఠక్కున ఎవరైనా సమాధానమిచ్చేస్తారు. అలాంటి రామకృష్ణే ఎవరు కనీసం చంద్రబాబు కూడా ఊహించని విధంగా గట్టి ఫిట్టింగ్ పెట్టేశారు. అదికూడా రెండు రోజుల డిజిటల్ మహానాడులో టీడీపీ చేసిన తీర్మానంపై మండిపడుతు.


ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు ఇవ్వాలంటు టీడీపీ రాజకీయ తీర్మానం చేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పుడు కూడా టీడీపీ నరేంద్రమోడి సర్కార్ కు మద్దతుగానే ఉంది. కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో ఎవరు అడగకపోయినా, అవసరంలేకపోయినా టీడీపీ సంపూర్ణమద్దతిచ్చింది. పార్లమెంటులో టీడీపీకి ఎంతమంది ఎంపిలున్నారనేది వేరేసంగతి. ఎలాగూ సంపూర్ణమద్దతిస్తున్న టీడీపీ ఇపుడు మద్దతు విషయంలో రాజకీయ తీర్మానం చేయటం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. మహానాడులో చేసిన తీర్మానం విషయంలోనే రామకృష్ణ కళ్ళు ఎరుపెక్కినట్లుంది. అందుకనే ఏఏ అంశాలపై నరేంద్రమోడి సర్కార్ కు టీడీపీ మద్దతివ్వాలని డిసైడ్ చేసిందో చెప్పాలని నిలదీశారు.



కరోనా వైరస్ నియంత్రణలో మోడి విఫలమైనందుకా ? లేకపోతే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని చెప్పినందుకా ? అదీకాకపోతే ప్రత్యేకహోదాలో ఏపికీ అన్యాయం చేసినందుకు మోడి ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసిందా అంటు చంద్రబాబును దులిపేశారు. పైగా కేంద్రం వైఫల్యాలను కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి మోడికి మద్దతు ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారంటు చురకలు కూడా అంటించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబుకు మద్దతుగా  ఉన్నది సీపీఐ ఒక్కటే. అలాంటిది మోడికి మద్దతు అన్న తీర్మానంతో చివరకు సీపీఐ మద్దుతు కూడా కోల్పోయినట్లే అనే అనుమానంగా ఉంది. ఎలాగూ బీజేపీ, సీపీఎం దగ్గరకు రానీయటంలేదు. చివరకు రాజకీయ తీర్మానం రివర్సు కొడుతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: