హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి ఎల్లోమీడియా అనుకూలమే కాదట ..పెద్ద జోక్

Vijaya
తెలుగుదేశంపార్టీకి ఏబిఎన్-ఆంధ్రజ్యోతికి అసలు సంబంధమే లేదట. టీడీపీకి ఆంధ్రజ్యోతి అనుకూలమే కాదట. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ? అవును ఆదివారం రాసిన కొ(చె)త్తపలుకులో ఎల్లోమీడియా యాజమని రాధాకృష్ణ అలాగే చెప్పారు. అంటే టీడీపీకి తమ సంస్ధలకు మధ్య తెరవెనుక ఏదో బలమైన బంధం ఉందనే విషయం జనాలందరు మాట్లాడుకుంటున్నారన్న విషయం మొత్తానికి రాధాకృష్ణకు బాగా తెలిసొచ్చినట్లుంది. కాకపోతే అదే విషయాన్ని నేరుగా ఒప్పుకోకుండా మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీదకు నెట్టేశారు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు విషయమై ప్రొఫెసర్ మాట్లాడుతు ‘ఆరెండు ఛానల్స్’ తెలుగుదేశంపార్టీ అనుకూల చానల్స్ అని ప్రొఫెసర్ చెప్పారట. అంటే రెండో చానల్ ఏదో చెప్పలేదు కానీ ఏబిఎన్ మాత్రం ఉందని ప్రొఫెసర్ చెప్పినట్లు రాధాకృష్ణ చెప్పుకున్నారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం చంద్రబాబునాయుడుకు బాకా ఊదే మీడియా అని ప్రత్యేకంగా ఎవరూ ఎవరికీ చెప్పక్కర్లేదు. రాజకీయ+మీడియా పరిజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు ఏ పార్టీని ఏ మీడియా భుజనేసుకున్నదో. సాక్షి మీడియా అంటే సొంత మీడియా కాబట్టి కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీలేదు. ఇదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి కొన్ని మీడియా సంస్ధలేవీ చంద్రబాబు సోంతానివి కావు. అయినా మరి ఎందుకని చంద్రబాబును అంతలా భుజాన మోస్తున్నాయి ? తెరవెనుక ఏదో గట్టి బంధం లేకపోతే చంద్రబాబును అంతలా జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం వాటికేమిటి ?



పై మీడియా సంస్ధలు నిష్పాక్షికంగా ఉండేట్లయితే ప్రభుత్వంలో జరిగే ప్రతి డెవలప్మెంటును నెగిటివ్ కోణంలోనే ఎందుకని చూస్తున్నాయి. ఇపుడు జగన్ హయాంలో జరిగిన విషయాలే చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. అప్పుడేమో వాటిని ప్రజలకు తెలీకూడదని తెగ ప్రాయాసపడ్డాయి. ఉదాహరణకు రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారు. దాన్ని హైలైట్ చేసినట్లుగా చంద్రబాబు హయాంలో పుష్కరాల సమయంలో రాజమండ్రిలో 30 మంది చనిపోయినపుడు హైలైట్ చేయలేదు. ఇక విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో 10 మంది రోగులు అగ్నికి ఆహుతైపోతే ఘటనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి ఉదాహరణలు కొల్లలున్నాయి ఆంధ్రజ్యోతి యాజమాన్యం జగన్ కు బద్దవిరోధమని, చంద్రబాబును భుజాన మోస్తున్నదని చెప్పటానికి. తెలుగుదేశానికి తాను అనుకూలం కాదన్న మాట ఎలాగుందంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతు తననెవరు చూడటం లేదన్నట్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: