హెరాల్డ్ సెటైర్ : డ్యామిట్...కథ అడ్డం తిరిగిందట

Vijaya

అవును వైసీపీ తిరుగుబాటు ఎంపి వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపిగా అతికష్టం మీద ముక్కీ మూలిగి మొత్తానికి 30 వేల మెజారిటితో గెలిచానని అనిపించుకున్నారు రఘురామ కృష్ణంరాజు. అలాంటిది గెలిచిన కొంతకాలానికే జగన్మోహన్ రెడ్డితో చెడింది. దాంతో వైసీపీతో పాటు జగన్ కు కూడా బాగా దూరమైపోయారు. ఎప్పుడైతే పార్టీలోనే ఉంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారో వెంటనే ఎల్లోమీడియా కళ్ళు ఎంపిపై పడింది. ఇంకేముంది రఘురామ వ్యాఖ్యలను ఎల్లోమీడియా బాగా హైలైట్ చేయటం మొదలుపెట్టాయి. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతారా అని వెయ్యికళ్ళతో చూస్తున్న ఎల్లోమీడియాకు తిరుగుబాటు ఎంపి ఆస్ధాన విధ్వాంసుడైపోయారు. తాను ఏమి మాట్లాడినా మెజారిటి మీడియా బాగా ప్రాధాన్యత ఇస్తోందన్న ఉద్దేశ్యంలో ఎంపి కూడా ఆరోపణలు, విమర్శలకు పదును పెంచారు.




సీన్ కట్ చేస్తే ఇటు ఎంపి అయినా అటు ఎల్లోమీడియాకైనా అంతర్లీనంగా ఎవరి అజెండా వాళ్ళకుంది. పార్టీని ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏదోరోజు పార్టీ నుండి తనను సస్పెండ్ చేస్తారు లేదా బహిష్కరిస్తారని ఎంపి అనుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో జగన్ కు దగ్గరయ్యే అవకాశం లేదని తేలిపోయిన తర్వాతే వ్యూహాత్మకంగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి బాగా ఇష్టుడైపోయారు. ఎలాగైనా తనపై పార్టీ నాయకత్వం ఏదో చర్య తీసుకునేట్లు చేసి నూరుశాతం స్వేచ్చాజీవిని కావాలనేది రఘురామ ప్లాను. ఈ విషయం గ్రహించింది కాబట్టే రఘురామపై పార్టీ ఎలాంటి చర్యలకు దిగకుండా ఏకంగా  ఎంపిపై అనర్హత పిటీషన్ దాఖలు చేసింది.




ఇక జగన్ పై తమకున్న కసినంతా ఎంపిని ముందుపెట్టి ఎల్లోమీడియా తీర్చుకుంటోంది. 2019లో వైసీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావటం, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటాన్ని చంద్రబాబునాయుడుతో పాటు ఎల్లోమీడియా కూడా తట్టుకోలేకపోతోంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నా బాగా హైలైట్ చేస్తున్నాయి. అంటే ఎంపి-ఎల్లోమీడియాలో ఎవరి అజెండా వాళ్ళకున్న విషయం అర్ధమైపోతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరి అజెండాల్లో దేన్నీ జగన్ అసలు లెక్కచేయలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తేకానీ తన అజెండా సక్సెస్ కాదని ఎంపి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శల్లో పదునుపెంచారు. అయితే ఎంపి ఊహిచని విధంగా సీఐడీ రంగంలోకి దిగేసింది. చడీ చప్పుడులేకుండా ఒక్కసారిగా ఇంటిమీదపడి ఎంపిని అరెస్టు చేసేసింది. దీంతో తాను ఒకటనుకుంటే చివరకు మరొకటయ్యిందని ఎంపికి అర్ధమైపోయింది. పనిలో పనిగా ఎల్లోమీడియా కూడా విషయం అర్ధమైపోయుంటుంది లేండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: