హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

Vijaya
చంద్రబాబునాయుడుకు అల్జీమర్స్ వచ్చిందని, మతిమరుపు బాగా పెరిగిపోయిందని వైసీపీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు అల్జీమర్స్ ముదిరిపోయిందని మొదటి బయటపెట్టింది కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. దాన్ని వైసీపీ నేతలు బాగా ప్రమోట్ చేస్తున్నారు. కేవీపీ చెప్పింది, వైసీపీ ప్రమోట్ చేస్తున్నది కరెక్టే అని తనంతట తానుగానే చంద్రబాబు అంగీకరించినట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే మీడియాతో చంద్రబాబు మాట్లాడుతు ఎన్నికల నిర్వహణ విషయంలో తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. హైకోర్టు ఏమి చెప్పిందంటే కరోనా వైరస్ నేపధ్యంలో  ఎన్నికల నిర్వహణలో విఫలమైన ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.ఇదే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేస్తు కరోనా వైరస్ పెరిగిపోవటంలో ఎన్నికల కమీషన్ పాత్రపై హైకోర్టు వ్యాఖ్యలను సమర్ధించారు. దాంతో చంద్రబాబు మాటలను విన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏపిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే పరిస్ధితి లేదని జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకున్నారు. కరోనా వైరస్ బాగా ఎక్కువగా ఉందని  ఈ పరిస్ధితుల్లో ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం అప్పటి స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెప్పింది. అయితే నిమ్మగడ్డ మాత్రం కరోనా కేసులు పెద్దగా లేవని కాబట్టి  ఎన్నికలు పెట్టాల్సిందే అని పట్టుబట్టారు. అయినా ప్రభుత్వం కాదంటే కోర్టుకెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్నారు.  ఎన్నికల నిర్వహించాల్సిందే అన్న నిమ్మగడ్డ వాదనకు చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చాయి.ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం ఎన్నికలు జరిపేసింది. ఇపుడు రాష్ట్రంలో పెరిగిపోతున్న కేసులకు స్ధానికసంస్ధల ఎన్నికలు కూడా ఒక కారణమే. తాజాగా చెన్నై హైకోర్టు వ్యాఖ్యలను సమర్ధించిన చంద్రబాబు గతంలో తాను ఏమి మాట్లాడారనే విషయాన్ని పూర్తిగా మరచిపోయిట్లున్నారు. అంటే ఏపిలో ఏమో ఎన్నికలు పెట్టాల్సిందే. ఇతర రాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ కారణంగా ఎన్నికల వాయిదా వేయాలంటే మద్దతిస్తారా ? ఇలాంటి ద్వంద్వ వైఖరి కారణంగానే చంద్రబాబుకు అల్జీమర్స్ బాగా ముదిరిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నది. అలాగే కరోనా మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే చూడాలని కూడా లోకేష్ అండ్ కో పెద్దఎత్తున గోల చేస్తున్నారు. మరి తాము అధికారంలో ఉన్నపుడు పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మంది చనిపోతే వీళ్ళెవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా ప్రమాదాల్లో ఒక్కోసారి ఇలాంటివి జరుగుతుంటాయని చంద్రబాబు చాలా లైటుగా తీసుకున్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: