సోము సార్ ఇలాగైతే ఎలా సార్...?

Gullapally Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని కీలక అంశాల్లో భారతీయ జనతా పార్టీ తప్పులు ఎక్కువగా చేస్తుంది ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్చార్జిల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో స్థాయిలో పార్టీ కోసం పని చేసే నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి బిజెపి రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుని ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకోవాల్సిన అవసరం పడుతుంది. కొత్త నాయకులని తయారు చేసిన సరే భారతీయ జనతా పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు

కాబట్టి కొన్ని కొన్ని అంశాలను బిజెపి రాష్ట్ర నాయకత్వం శ్రద్ధ పెట్టి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా సరే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పట్టించుకోవడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జిలు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు విషయంలో ముందుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివలన సమస్య తగ్గే అవకాశం కూడా లేదు అనే భావన ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పెద్దగా అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.

కాబట్టి వాళ్ళని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చి స్వేచ్ఛగా ముందుకు నడిపిస్తే మంచి ప్రయోజనాలు ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవడం లేదు అని కొంతమంది అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిసినా సరే  బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడంతో కొన్ని కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: