తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ భవిష్యత్తుపై జనాలందరు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే స్వయంగా అచ్చెన్న నోటినుండి వినిపించటం పార్టీలో కూడా కలకలం రేపుతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో అచ్చెన్న చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్ కన్నా ముందునుండే తిరుపతిలో అచ్చెన్న మకాం వేశారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఎలు, మాజీ ఎంపిలతో సమావేశమవుతున్నారు. ఇంతటి బిజీలో ఉన్న అచ్చెన్న ఎక్కడో ఓ ఇంట్లో తన సన్నిహితులతో జరిపిన ప్రైవేటు సంభాషణ లీకైంది.
వెంకట్ అనే అజ్ఞాత వ్యక్తి బహుశా అచ్చెన్నకు బాగా సన్నిహితుడిగా అర్ధమవుతోంది. అచ్చెన్న టిఫిన్ తింటున్నసమయంలో సదరు వెంకట్ అధ్యక్షునితో తన బాధలు చెప్పుకున్నారు. బహుశా ఆ వెంకట్ రియాల్టరో లేకపోతే బిల్డరో అయ్యుండచ్చు. ఆయనకు కేఎల్ నారాయణ అనే వ్యక్తి రు. 6 కోట్లు ఇవ్వాలట. తనకు రావాల్సిన సొమ్ముల కోసం వెంకట్ నానా అవస్తలు పడుతున్నట్లున్నాడు. చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణతో ఎన్నిసార్లు చెప్పుకున్నా పనయినట్లులేదు. ఒకటికి రెండుసార్లు లోకేష్ ను కలిస్తే మరేమూడులో ఉన్నారో ఏమో వెంకట్ ను కుటుంబంతో సహా సూసైడ్ చేసుకోమని చెప్పారట. బహుశా వెంకటే తనకు రావాల్సిన డబ్బు రాకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుండచ్చు. అదే విషయాన్ని తాజాగా అచ్చెన్నతో కూడా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతు ‘మీరెన్నయినా చెప్పండి పార్టీ పనైపోయింది’ అన్నాడు. వెంటనే అచ్చెన్న మాట్లాడుతు ‘ఈనెల 17వ తేదీ ఎన్నిక అయిపోగానే ఫ్రీ అయిపోతాం. నేను మాట్లాడుతా’నన్నారు.
వెంకట్ పార్టీ పనైపోయిందనే మాటను పదే పదే చెప్పిన తర్వాత ‘ఇందులో అనుకునేదేముంది ? పార్టీకి భవిష్యత్తులేదు...బొక్కా లేదు’ అన్నారు. వెంకట్ మాట్లాడుతు తన డబ్బుల విషయాన్ని లోకేష్ తో ప్రస్తావించిన సమయంలో తన కష్టాలు చెప్పుకుంటే సూసైడ్ చేసుకోమని అన్నట్లుగా వెంకట్ చెప్పారు. అచ్చెన్న మాట్లాడుతు తొందరపడద్దు ఎన్నికలైపోయిన తర్వాత నేరుగా ఫోన్ కలిపి మాట్లాడిస్తాను అని హామీ ఇచ్చారు. అసలు వాళ్ళు బాగుంటే (చంద్రబాబు+లోకేష్) పార్టీకి ఈ పరిస్ధితి ఎందుకు వచ్చేది ? అంటు వెంకట్ నే అచ్చెన్న ఎదురు ప్రశ్నించారు. మొదటినుండి ఏదో పట్టుమీదున్నాం కాబట్టి ఏదోలా లాక్కొస్తున్నాం అని అచ్చెన్నారు. ఆ సందర్భంలో నే పార్టీకి ఇక భవిష్యత్తు లేదు..బొక్కాలేదు.. అని అచ్చెన్న స్పష్టంగా అన్నారు. ఇపుడా వీడియో లేకవ్వటంతో సంచలనంగా మారింది.