నారా లోకేష్ ను అందరు మందలగిరి మాలోకమని, పప్పు అని ఎందుకంటారో జనాలకు తాజాగా బాగా క్లారిటి వచ్చేసుంటుంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చినబాబు కూడా ప్రచారంలోకి దూకాడు. అసలు ఇంతవరకు చినబాబు ప్రచారంలోకి రాకపోవటంతోనే పార్టీ నేతల ప్రచారం ప్రశాంతంగా జరుగుతోంది. లోకేష్ ప్రచారంలోకి దిగాడంటే అందరు మటాషే అని చప్పుకోవాల్సిందే. కాకపోతే మటాష్ అయ్యేది ప్రత్యర్ధులు కాదు, సొంతపార్టీ నేతలే. చినబాబు తన ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్ది తరపున ప్రచారం చేయటం, ఓట్లేసి గెలిపించమని అడగటంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఆ తర్వాత లోకేష్ మాట్లాడిన మాటులు, ఇచ్చిన హామీలే విచిత్రంగా ఉంది. దీంతో లోకేష్ ను మాలోకమని, పప్పు అని ఎందుకంటారో జనాలకు ఫుల్లుగా క్లారిటి వచ్చేసింది.
ఇంతకీ విషయం ఏమిటంటే పనబాకకు ఓట్లేసి గెలిపిస్తే వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చేశాడు. ఒక ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి గెలిస్తే గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలను టీడీపీ ఎలా తగ్గించగలదు ? అసలు గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు కేంద్రప్రభుత్వం ఆధీనంలోని సంస్ధల నియంత్రణలో ఉంటాయి. ఆ సంస్ధలకు తెలుగుదేశంపార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని ఎవరినడిగినా చెబుతారు. మరి అందరికీ తెలిసిన ఇంతచిన్న విషయం కూడా లోకేష్ తెలీకపోవటమే విచిత్రంగా ఉంది. అంటే జనాలను మాలోకాలని చినబాబు అనుకున్నాడా ? అనే సందేహం వస్తోంది. నిజానికి లోకేషే మాలోకం కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీకి ఒక్క ఎంపిని గెలిపిస్తేనే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చేసిన మాలోకం మరి ఇప్పటికే ముగ్గురు ఎంపిలున్నారు కదా మరెంత ధరలు తగ్గించారో చెబితే జనాలు తెలుసుకుంటారు.
ఇక ధరల సంగతిని పక్కన పెట్టేస్తే వృద్ధాప్య ఫించన్ నెలకు రూ. 3 వేలకు ఒకేసారి పెంచేస్తామని మరో హామీ ఇచ్చారట. వృద్ధాప్య ఫించన్ అన్నది రాష్ట్రప్రభుత్వ పాలసి. ప్రభుత్వం తీసుకోవాల్సిన పాలసీని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎలా తీసుకోగలుగుతుంది ? పైగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ అమలుకు ఏమిటి సంబంధం . పెన్షన్ పెంచే విషయామై నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి జగన్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని టీడీపీ ఎలా తీసుకోగలుగుతుంది ? ఎలా అమలు చేయగలుగుతుంది ? ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేయటం, జనాల ముందు చులకన, పలుచనైపోవటం మాలోకానికి మామూలే అని జనాలకు బాగా తెలుసు. అందుకనే లోకేష్ మాట్లాడుతున్నాడంటేనే జనాలు సరదాగా తీసుకుంటారు.