హెరాల్డ్ సెటైర్ : బావ, బావమరిది ఇద్దరికీ ఒకటే దెబ్బ

Vijaya
ఒకరికి ఎక్కువా లేదు మరొకరికి తక్కువా లేదు. ఎవరి స్ధాయిలో వాళ్ళకు దక్కాల్సింది దక్కింది పంచాయితి ఎన్నికల్లో. తాజాగా నాలుగో విడతలో జరిగిన పంచాయితి ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కూడా అధికార వైసీపీ మద్దతుదారుల హవానే కనబడింది. నిజానికి స్ధానికసంస్ధల ఎన్నికలంటేనే అధికారపార్టీకి మొగ్గుంటుంది. అలాకాకుండా ప్రతిపక్షాలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. అనంతపురం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలను పక్కనపెట్టేసినా హిందుపురం నియోజకవర్గంలో బావమరిది+ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు గట్టి దెబ్బే తగిలింది. నియోజకవర్గంలోని 52 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు  ఏకంగా 47 పంచాయితీల్లో గెలిచారు. టీడీపీకి దక్కింది కేవలం ఐదంటే ఐదుమాత్రమే.  బాలయ్య నియోజకవర్గంలో ఇంతటి ఘోర పరాజయం గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు.



మొన్నటికి మొన్న మూడో విడతలో జరిగిన పంచాయితి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో చంద్రబాబునాయుడుకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు 74 పంచాయితీల్లో గెలిచారు. టీడీపీ మద్దతుదారులు గెలిచింది 14 పంచాయితీల్లోనే. ఇక్కడ కూడా గడచిన 30 ఏళ్ళల్లో పార్టీ మద్దతుదారులకు ఎదురుదెబ్బ తగలటం ఇదే మొదటిసారి. కుప్పంలో పంచాయితి అయినా అసెంబ్లీకి అయినా తెలుగుదేశంపార్టీ తరపున నామినేషన్ వేస్తే గెలవటమే. అందుకనే ఇక్కడ నుండి చంద్రబాబు వరుసగా ఆరుసార్ల నుండి గెలుస్తునే ఉన్నారు. కుప్పం జనాలు రాజకీయంగా చంద్రగిరి జనాలంత చైతన్యవంతులు కారు. అందుకనే మొదటిసారి గెలిచి, రెండోసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంవైపు చూస్తే ఒట్టు.



స్ధానిక సంస్ధల ఎన్నికల ముందు చంద్రబాబు అయినా బాలకృష్ణ అయినా పెద్ద పెద్ద మాటలు చాలానే చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే మొత్తం స్ధానాల్లో టీడీపీనే గెలవాలని, గెలుస్తుందంటు గట్టి మాటలు చెప్పారు. తీరా చూస్తే ఎక్కడికక్కడ ఫలితాలు ఎదురుతంతోంది. సరే పంచాయితి ఎన్నికలతో ఏమవుతుంది ? స్ధానిక సంస్ధల ఎన్నికలతో ఏమవుతుందన్నది వేరే సంగతి. దీన్నొక అలారమ్ లాగ తీసుకుని పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటే పార్టీ దానికదే మళ్ళీ బలోపేతమవుతుంది. లేదంటే తొందరలోనే కనుమరుగవ్వటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: