హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

Vijaya
రాబోయేది తెలుగుదేశంపార్టీ ప్రభుత్వమే..చంద్రబాబునాయుడును ఒప్పించి నేనే హోమంత్రిగా ఉంటాను’ ఇది తాజాగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడిపేరు సొమలింగం అన్న సామెతలాగుంది అచ్చెన్న మాటలు. మూడేళ్ళ తర్వాత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందో లేదో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా గట్టిపోటీ కాదు కనీసం పోటీ ఇస్తుందని కూడా టీడీపీ నేతలకే తమపార్టీపై నమ్మకం లేదు. పోటీ ఇచ్చే విషయంలోనే నేతలు అనుమానంగా మాట్లాడుతుంటే ఏకంగా అధికారంలోకి వచ్చేసేది టీడీపీనే అని అచ్చెన్న బల్లగుద్దకుండానే చెప్పేస్తున్నారంటే విచిత్రంగా ఉంది.



ఇంతకీ అచ్చెన్నకు ఎందుకింత ఆవేశం వచ్చేసింది ? ఎందుకంటే పోలీసులు మంగళవారం ఉదయం అచ్చెన్నను ఇంట్లో అరెస్టు చేశారు. నిమ్మడ పంచాయితి సర్పంచ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అచ్చెన్న వైసీపీ అభ్యర్ధి కింజరాపు అప్పలనాయుడును బెదిరించారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అచ్చెన్నను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దాంతో పోలీసులపై ఈ మాజీమంత్రి నోటికొచ్చినట్లు రెచ్చిపోయారు. నిజానికి అచ్చెన్న చెప్పిన మాటలను పోలీసులు వాళ్ళ సర్వీసులో చాలామంది దగ్గర వినే ఉంటారు. తమపై రంకెలు వేయటం, బెదిరించటం, నోటికొచ్చినట్లు తిట్టడం లాంటి నేతలను చూసి చూసి పోలీసులకు అలావాటైపోయుంటుంది. అయినా అధికారంలో ఉన్న వాళ్ళు ఏమి చెబితే గుడ్డిగా అది చేయటానికే పోలీసులు అలవాటు పడిపోయారు.



ఇఫుడు పోలీసులను చూసి అసహ్యం కలుగుతోందని చెబుతున్న అచ్చెన్న తమ హయాంలో ఏమి చేశారో మరచిపోయినట్లున్నారు. ఎంతమంది వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపింది అచ్చెన్నకు గుర్తులేకుండానే ఉంటుందా ? తాము అధికారంలో ఉన్నపుడు అధికారం తమకే శాశ్వతమనే భ్రమల్లో వైసీపీ నేతలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు. అప్పుడు చేసిన యాక్షన్ కు ఇపుడు రియాక్షన్ తప్పటం లేదు. ఈ రియాక్షన్ నుండి తప్పించుకోవటానికే అచ్చెన్న లాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఓవర్ యాక్షన్ కు బాస్ చంద్రబాబునాయుడే మార్గదర్శి. చంద్రబాబు హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుని ఓవర్ యాక్షన్ చేస్తుంటే అచ్చెన్న లాంటి వాళ్ళు క్షేత్రస్ధాయిలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చూద్దాం హోంశాఖ మంత్రిగా అచ్చెన్న ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారో .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: